- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐదేళ్ల వైసీపీ పాలనలో జనం నరకయాతన అనుభవించారు: ఉయ్యూరు సభలో చంద్రబాబు
దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ ఐదేళ్ల పాలనలో ప్రజలంతా నరకయాతన అనుభవించారని టీడీపీ జాతీయ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా ఉయ్యూరులో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సంధర్బంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. వైసీపీ ఐదేళ్ల పాలనలో ప్రజలంతా నరకయాతన అనుభవించారని తెలిపారు. పార్టీ నేతలను, కార్యకర్తలను, సామాజిక ఉద్యమకారులను ఆ సైకో బారి నుంచి కాపాడుకోవడానికి నిద్రలేని రాత్రులు గడిపామని తెలిపారు. జగన్ ఆఖరికి తనను కూడా అక్రమ కేసు పెట్టి జైల్లో పెట్టించారని గుర్తు చేశారు. నేను జైలు నుంచి విడుదలై రాజమండ్రి నుంచి విజయవాడ రావటానికి 16 గంటలు పట్టిందంటే.. ప్రజలు తనపై చూపిన అభిమానం జీవితంలో ఎన్నడూ మర్చిపోలేనని తెలిపారు. నా ప్రాణం ఉన్నంత వరకు ప్రజాసేవకే అంకితం అవుతానని అన్నారు.
ముస్లింలకు న్యాయం చేసేది టీడీపీనే
మనకు కులాలు, మతాలు ముఖ్యం కాదు. రెండు సార్లు ఎన్డీయేతో పొత్తు పెట్టుకున్నాం. ఏ నాడైనా ముస్లింలకు అన్యాయం జరిగిందా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 13 జిల్లాల్లో ఉర్దూను రెండో భాషగా ఏర్పాటు చేశాం. ముస్లింలకు ప్రత్యేకంగా ఫైనాన్స్ కార్పోరేషన్ ఏర్పాటు చేశామని అన్నారు. హైదరాబాద్, కడపలో హజ్ హౌస్‌లు కట్టించామని తెలిపారు. రంజాన్ తోఫా, దుల్హన్ సంక్షేమ పథాకాలను అమలు చేశామని పేర్కొన్నారు. ఇమామ్, మౌజమ్ లకు వేతనాలిచ్చామని, 4 శాతం ముస్లింల రిజర్వేషన్ల అంశం సుప్రీం కోర్టులో ఉంటే లాయర్లను పెట్టి కాపాడామని గుర్తు చేశారు. నేడు బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ముస్లింలకు అన్యాయం జరుగుతోందని జగన్ అంటున్నాడని.. అదే వైసీపీ అప్పుడు ఎక్కడి వెళ్లిందంటూ సెటైర్ల వేశారు. నంద్యాలలో రంజాన్ మాసంలో నమాజ్ చేసుకుని ఇంటి నుంచి బయటికి వెళ్తున్న ముస్లిం ఆడబిడ్డను వైసీపీ నేత కండకావరంతో బురఖా ఎత్తి అవమానించారని అన్నారు. నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్యకు పాల్పడితే జగన్ ఏమైపోయాడని అన్నారు.
పవన్ పారితోషకం వదులుకుని రాష్ట్రం కోసం ముందుకొచ్చారు
సైకో పాలన పోతేనే మన పిల్లలకు మంచి భవిష్యత్తు, వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదని పవన్ పొత్తుకు మూడు పార్టీలను ఒప్పించాడని అన్నారు. హీరోగా పారితోషికం వదులుకుని రాష్ట్రం కోసం పవన్ ముందుకొచ్చారని తెలిపారు. అతడిని వైసీపీ నేతలు అవమానించి మాట్లాడతారా.. పవన్ పర్యటనలను అడ్డుకుంటారా? పవన్ అభిమానులు తలచుకుంటే జగన్ పరిస్ధితి ఏంటని చంద్రబాబు అన్నారు. తాను 14 ఏళ్లు సీఎంగా ఉన్న నాడు.. తాను తలుచుకుంటే జగన్ అడుగు బయటపెట్టేవాడా అని అన్నారు. నిన్నటి వరకు ఆకాశంలో తిరిగిన జగన్ నేడు ఎన్నికలొచ్చాక బయటకొచ్చాడంటూ ఎద్దేవా చేశారు. ఆకాశంలో తిరుగుతుంటే కింద చెట్లు కొట్టేస్తున్నారంటూ దుయ్యబట్టారు. జగన్ వస్తే ముందు గొడ్డలి వస్తుందని, ఆ తరువాతే జగన్ వస్తాడంటూ సైటర్లు వేశారు.
జగన్ ఒంటిరిగా కాదు శవాలతో వస్తున్నాడు
తాను ఒంటరిగా వస్తున్నానని జగన్ అంటున్నారు, కాదు శవాలతో వస్తున్నాడని చంద్రబాబు ఆరోపించారు. 2014లో తండ్రి లేడన్నాడు, 2019 లో బాబాయి లేడన్నాడు, బాబాయిపై గొడ్డలి వేటిసింది ఎవరు? ఇప్పుడు ఫించన్లు ఇవ్వలేక వృద్దులను చంపేసి వాళ్ల శవాలతో రాజకీయాలు చేస్తున్నారని మండి పడ్డారు. ఇక మంత్రి జోగి రమేష్ శవ రాజకీయాలు చేస్తున్నాడంటూ ఫైర్ అయ్యారు. ఆయన రాజకీయం ఏంటో చూస్తా.. పెనమలూరు ప్రజలు తిరుగు టపాలో పంపాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. జగన్ వద్ద ఎవరూ ఉండలేరు, అమరావతి, పోలవరం ఆగిపోయాయి, వైసీపీలో ఉంటే చరిత్ర హీనుడిగా మిగిలిపోతానని బాలశౌరికి సీటు ఇస్తానని చెప్పినా ఆయన వైసీపీకి రాజీనామా చేశారని అన్నారు.
అదేవిధంగా పార్ధసారథి కూడా టీడీపీలో చేరారని తెలిపారు. వైసీపీలో మంచివాళ్లకు చోటు లేదని, అందులో ఉంది బూతుల మంత్రి, గన్నవరం వంశీ, పేర్ని నాని వాళ్లు నాయకులా.. వాళ్లకు జనం ఓటు వేయాలా? అని ప్రశ్నించారు. ఆడ బిడ్డలకు ఆస్తిలో సమానహక్కు, స్ధానిక సంస్ధల్లో 8 శాతం రిజర్వేషన్లు కల్పించామని తెలిపారు. దీపం పధకంతో వంట గ్యాస్ ఇచ్చామని గుర్తు చేశారు. మహిళల ఆత్మగౌరవం కోసం మరుగుదొడ్లను నిర్మించామన్నారు. సూపర్ సిక్స్‌లో భాగంగా ప్రతి ఆడబిడ్డకు నెలకు రూ.1,500 ఇస్తామని, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని, ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఇక తల్లికి వందనం కింద ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.15 వేలు ఇస్తామని స్పష్టం చేశారు.
యువతకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి జగన్ రెడ్డి?
మెగా డీఎస్సీ, ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ హామీలు ఏమయ్యాయి? ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చాక ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తామని తెలిపారు. వర్క్ ఫ్రమ్ హోం విధానం తెచ్చి నియోజకవర్గ స్థాయిలో ఐటీ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని అన్నారు. తాను ఆర్టీసిఫియల్ ఇంటలిజెన్స్‌తో స్వర్ణయుగం అంటుంటే.. జగన్ మాత్రం రాతియుగం అంటున్నాడని తెలిపారు. మీ భూములు జాగ్రత్త అంటూ జగన్ ప్రభుత్వం భూ రక్షణ చట్టాన్ని తీసుకొచ్చిందని తెలిపారు. అలా డ్యాక్యుమెంట్ల నెంబర్లు మార్చి భూములు కొట్టేసి బ్యాచ్ జోగి రమేష్ అని అరోపించారు. ఇటీవల 4 ఎకరాల భూమిని కబ్జా చేస్తే కడప జిల్లా ఒంటిమిట్టలో చేనేత కుటుంబం విషం తాగి ఆత్మహత్యలకు పాల్పడిందని గుర్తు చేశారు.
టీడీపీ అధికారంలోకి రాగానే..
ఉచితంగా టిడ్కో ఇళ్లు కట్టి పేదలకు ఇస్తామని, విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు టీడీపీ హయాంలో నాలుగులైన్ల రహదారి నిర్మించామని గుర్తు చేశారు. బందరు రోడ్డులో రద్దీ తగ్గించడానికి పంట కాలువపై రోడ్లు అభివృద్ధి చేశామని అన్నారు. కడశార బ్రిడ్ర్జి 90 శాతం పూర్తి చేస్తే మిగిలిన పనులు పూర్తి చేయలేకపోయారంటూ చంద్రబాబు ఫైర్ అయ్యారు. ఆ పనులు టీడీపీ ప్రభుత్వం రాగానే పూర్తి చేస్తామని అన్నారు. కృష్ణా డెల్టాను ఆధునీకరణ చేస్తామని, పంట కాలువల్లో పూడిక తీస్తామని తెలిపారు. ఇక కంకిపాడు మండలం కుందేరు బ్రిడ్జి పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. పెద్ద మసీదుకు తాను రూ.25 లక్షలిస్తే సీఎం జగన్ రాగానే క్యాన్సిల్ చేశారని గుర్తు చేశారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మీరు మే 13న రెండు బటన్లు నొక్కాలని, ఒకటి సైకిల్ గుర్తుపై వేసి బోడె ప్రసాద్‌ను గెలిపించాలి, రెండోది గ్లాస్ గుర్తుపై బటన్ నొక్కి జనసేన ఎంపీ అభ్యర్ది బాలశౌరిని గెలిపించాలని చంద్రబాబు విజ్ఞప్త చేశారు.