బాత్​రూమ్​లలోకి తొంగిచూస్తున్నారు..

by Anil Sikha |
బాత్​రూమ్​లలోకి తొంగిచూస్తున్నారు..
X

దిశ, డైనమిక్​ బ్యూరో : బాత్రూమ్​లోకి కొందరు తొంగి చేస్తున్నారంటూ విద్యార్థినులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన అనంతపురంలోని సెంట్రల్​ యూనివర్సిటీలో కలకలం రేపింది. అనంతపురంలోని బుక్కరాయసముద్రంలో ఉన్న సెంట్రల్ యూనివర్సిటీ వద్ద అర్ధరాత్రి విద్యార్థినులు ఆందోళనకు దిగారు. కొందరు గుర్తు తెలియన వ్యక్తులు తమ బాత్​రూములలోకి తొంగి చూస్తున్నారంటూ ఆరోపించారు. తాము కేకలు వేయడంతో పారిపోయారని చెబుతున్నారు. వైస్​ చాన్సలర్​ దృష్టికి తీసుకు వెళ్లినా పట్టించుకోలేదని అన్నారు. వారికి విద్యార్థి సంఘాలు మద్దతు తెలిపాయి. కొద్ది రోజుల కిందట ఇటువంటి ఘటన ఇక్కడ చోటు చేసుకుంది. అప్పట్లో స్థానిక ఎమ్మెల్యే శ్రావణి కూడా అక్కడికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. తిరిగి అటువంటి ఘటన చోటు చేసుకోవడంతో విద్యార్థినులు ఆందోళన చెందుతున్నారు. తమ పిల్లలకు రక్షణ కరువవుతోందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

Next Story