Breaking: ఆయన్ని కలిసేందుకు ఎస్కార్ట్ లేకుండా ఒంటరిగా వెళ్లిన పవన్..

by Indraja |   ( Updated:2024-02-04 14:56:17.0  )
Breaking: ఆయన్ని కలిసేందుకు ఎస్కార్ట్ లేకుండా ఒంటరిగా వెళ్లిన పవన్..
X

దిశ డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల జోరు హోరందుకుంది. రానున్న ఎన్నికల్లో గెలుపేధ్యేయంగా పార్టీల అధినేతలు ఆచి తూచి అడుగులేస్తున్నారు. వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జట్ స్పీడ్ తో ముందుకు వెళ్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా హోర్డింగులు పెట్టడం దగ్గర నుండి అభ్యర్థులను ప్రకటించడం వరకు తగ్గేదేలే అన్నట్లు ముందుకు వెళ్తున్నారు. ఇక రాజకీయాల్లో అనుభవజ్ఞులైన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మాత్రం నిదానమే ప్రదానం అన్నట్లు అడుగెలుస్తున్నారు.

ఇక ఆయన అడుగుజాడల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వినమ్రతతో నడుస్తున్నారు. అయితే ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపధ్యంలో సీట్ల కేటాయింపు పై చంద్రబాబు ద్రుష్టి సారించారు. దీని కోసం గత మూడు రోజులుగా హైదరాబాద్ లోనే ఉన్న చంద్రబాబు పలుమార్లు జనసేన అధినేత పవన్ తో భేటీ అయ్యి సీట్ల కేటాయింపు పై చర్చించారు. కాగా సీట్ల కేటాయింపు పై తుది నిర్ణయం తీసుకునేందకు మరోసారి ఇరు పార్టీల నేతలు అమరావతిలో భేటీ అయ్యారు.

ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుని కలిసేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎస్కార్ట్ లేకుండా ఒంటరిగా వెళ్లారు. ఇక ఈ సమావేశంలో ఉమ్మడి మ్యానిఫెస్టో, ఎన్నికల వ్యూహం పై ఇరు పార్టీల అధినేతలు చర్చించనున్నారు. అలానే సీట్ల సర్దుబాటు పై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే చంద్రబాబును కలిసేందుకు పవన్ ఎందుకు ఒంటరిగా వెళ్లారు అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

ఇక మరో రెండు మూడు రోజుల్లో ఇరు పార్టీల అధినేతలు కలిసి ప్రెస్ మీట్ నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ టీడీపీ, జనసేన అధినేతలు జోరు పెంచుతున్నారు. ఇరు పార్టీల మధ్య చిన్న చిన్న అరమరికలు వస్తున్న.. వాటిని అధిగమించి విబేధాలకు తావివ్వకుండా ముందుకు వెళ్తున్నారు. ఓ వైపు అధికార పార్టీ నేతలు టీడీపీ, జనసేన పొత్తుపై విమర్శలు గుప్పిస్తున్న.. ఆ విమర్శలను పట్టించుకోకుండా ఇరుపార్టీల నేతలు, అధినేతలు తమ కార్యకలాపాల్లో నిమగ్నమైయ్యారు.

ఇక త్వరగా సీట్ల సర్దుబాటుపై తుది నిర్ణయం తీసుకుని అభ్యర్థులను ప్రకటించేందుకు చంద్రబాబు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మరో వారం పది రోజుల్లో అభ్యర్థులను టీడీపీ, జనసేన అధినేతలు ప్రకటించనున్నారు . అనంతరం చంద్రబాబు తిరిగి రా కదిలిరా భహిరంగ సభల్లో పాల్గొంటారు. ఇప్పటికే 17 రా కదిలిరా బహిరంగ సభల్లో పాల్గొన్న చంద్రబాబు మరో మూడు నాలుగు సభల్లో పాల్గొననున్నారు.

Read More..

వినుకొండ వైసీపీకి భారీ షాక్.. మాజీ ఎమ్మెల్యే మక్కెన గుడ్ బై

Advertisement

Next Story

Most Viewed