- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Breaking: జోష్ పెంచిన బీజేపీ.. నేడు ఢిల్లీకి పవన్
దిశ డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ లో పొత్తుల రాజకీయాలు కాకపుట్టిస్తున్నాయి. ఇప్పటికే టీడీపీతో జనసేన పొత్తు ప్రకటించింది. రానున్న ఎన్నికల్లో కలిసి పోటీ చేయనున్న నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య సీట్లకేటాయింపు కూడా ముగిసిందని సమాచారం. కాగా టీడీపీ పొత్తు లోకి తాజాగా బీజేపీ కూడా చేరింది. నిన్న డిల్లీకి చేరుకున్న చంద్రబాబు అమిత్ షాతో భేటి అయ్యారు. ఈ నేపద్యంలో దాదాపు 50 నిమిషాల పాటు అమిత్ షాతో చర్చలు జరిపిన చంద్రబాబు బీజేపీతో పొత్తు ఖాయం చేసుకున్నట్లు సమాచారం.
ఇక ఈ రోజు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీకి చేరుకోనున్నారు. ఇక రానున్న ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లను కైవసం చేసుకుంటుందని బీజేపీ అధిష్టానం ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే మూడవసారి కూడా అధికారాన్ని చేపట్టడానికి కావాల్సిన బలం బీజీపీకి ఉన్న.. అధికారం లోకి వచ్చిన తరువాత చోటు చేసుకునే కీలక పరిణామాల నేపథ్యంలో.. దేశ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని బీజేపీ దేశవ్యాప్తంగా ఉన్న కీలక నేతలతో పొత్తు పెట్టుకుంటోందని సంబధిత వర్గాల సమాచారం.
ఈ నేపథ్యంలో ఎన్డీయే కూటమిలో చేరేందుకు బీజేపీ, జనసేన, టీడీపీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. నిన్న అమిత్ షాతో చంద్రబాబు చర్చలు ఓ కొలిక్కి వచ్చాయి. ఇక బీజేపీకి దేశ అవసరాలు, ప్రయోజనాలు ఎంత ముఖ్యమో తనకు ఆంధ్ర రాష్ట్ర అవసరాలు, ప్రయోజనాలు అంతే ముఖ్యం అని చంద్రబాబు తేల్చి చేప్పారు. చంద్రబాబు అడిగిన దానిలో న్యాయం ఉందని.. కనుక తన అభీష్టాన్ని కేంద్రం గౌరవిస్తుందని బీజేపీ చంద్రబాబుకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. తెలుగుదేశం అధినేత చర్చలు కొలిక్కి వచ్చిన నేపథ్యంలో ఆయన అడుగుజాడల్లో నడుస్తున్న పవన్ కళ్యాణ్ నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు.