- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాయలసీమపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: రాయలసీమపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. రాయలసీమ ఐదుగురి వ్యక్తుల్లో బంధీ అయిపోయిందని అన్నారు. బానిస సంకెళ్ల మధ్య సీమ ఇరుక్కుపోయిందని తెలిపారు. పోరాటాలకు పిలుపునిస్తే సీమవాసులు పెద్దఎత్తున తరలివస్తాయని అన్నారు. కానీ, ఎన్నికలు వచ్చేసరికి వెనక్కి వెళ్లిపోతున్నారని అసహనం వ్యక్తం చేశారు. అంతకుముందు తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు జనసేన పార్టీలో చేరారు.
మంగళగిరి కార్యాలయంలో ఎమ్మెల్యే శ్రీనివాసులకు అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఎమ్మెల్యేతో పాటు మరికొంతమంది వైసీపీ కార్పొరేటర్లు జనసేనలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఏపీకి దశ దిశ చూపించే సత్తా ఉన్న నేత పవన్ కళ్యాణ్ అని అన్నారు. ఇటీవలే తాను తొలిసారిగా పవన్ కళ్యాణ్‌ను కలిశానని.. ఆయనతో మాట్లాడిన తరువాత ప్రజల కోసం పరితపించే పవన్ కనిపించారన్నారు.