- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం జగన్ ఒక మానసిక రోగి.. పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసే పరిస్థితులు వచ్చాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. శనివారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. మరోసారి జగన్ గెలిస్తే ప్రజలు భరించగలరా అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌ను జగన్ చెర నుండి విముక్తి చేయాలన్నారు. ఇప్పుడు సీఎం జగన్‌కు వత్తాసుపలికే పోలీసులు ఒకసారి ఆలోచించుకోవాలని హెచ్చరించారు. పోలీసులు తాము చేస్తున్నది సబబేనా అని ప్రశ్నించుకోవాలని సూచించారు.
ప్రతిపక్ష నేతలపై ఇంకా ఎన్ని కేసులు పెడతారని.. కేసులు పెడితే తాము భయపడిపోతామా అని నిలదీశారు. ముఖ్యమంత్రి పదవి ఉందని ఓ తెగ ఫీలైపోవద్దని.. ప్రజలకు కోపం వస్తే కొట్టి చంపేస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ నువ్వేమైనా పై నుంచి దిగొచ్చావా అని అని ప్రశ్నించారు. నువ్వేంత.. నీ బతుకెంత.. నీ స్థాయి ఎంత అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ ఒక మానసిక రోగి అని.. ఎయిమ్స్ నుండి ఒక మంచి డాక్టర్‌ను పంపించి.. చెకప్ చేయించాలని ఎద్దేవా చేశారు. వైసీపీని ఏపీ నుండి పంపించడానికి ఇదే మంచి సమయమని పవన్ అన్నారు.
More News : Janasena: సనాతన ధర్మంపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు