- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పిఠాపురం నుండే AP దశ మారుస్తా: పోటీపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: పిఠాపురం అసెంబ్లీ నుండి పోటీ చేయడంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గ నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పిఠాపురం చాలా ప్రత్యేకమైన నియోజకవర్గమని.. ఇక్కడి నుండి పోటీ చేయడం నా అదృష్టమని అన్నారు. పిఠాపురం నుండి పోటీ చేసేందుకు అవకాశం కల్పించిన ప్రజలకు ఈ సందర్భంగా జనసేనాని ధన్యవాదాలు తెలిపారు. పిఠాపురం నుంచే ఏపీ దశ మారుస్తానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి గోదావరి జిల్లాలో పిఠాపురం నియోజకవర్గం కీలకమైందన్నారు. 2019 ఎన్నికల్లోనే పలువురు పిఠాపురం అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేయమంటే ఆలోచించానని గుర్తు చేశారు.
పిఠాపురాన్ని ఒక నియోజకవర్గంగా చూడలేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కులాల ఐక్యత జరగాలని.. కాపులు పెద్దన్న పాత్ర పోషించాలని పవన్ ఆకాంక్షించారు. కాగా, వచ్చే ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ-జనసేన పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగుతోన్న విషయం తెలిసిందే. పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ స్థానాలు, రెండు పార్లమెంట్ స్థానాలు దక్కాయి. ఇందులో ఇప్పటికే కొందరు అభ్యర్థులను ఫిక్స్ చేసిన పవన్.. మిగిలిన స్థానాల అభ్యర్థుల ఎంపిక ఫోకస్ పెట్టారు. ఇక, తాను వచ్చే ఎన్నికల్లో పిఠాపురం అసెంబ్లీ నుండి పోటీ చేస్తానని పవన్ కల్యాణ్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.
Read More..
స్థానిక నాయకులకే కూటమి టికెట్ ఇవ్వాలని టీడీపీ నేతలు డిమాండ్..