- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP News:‘ప్రజల కోసమే పవన్ కళ్యాణ్ నిర్ణయాలు’.. మంత్రి నాదెండ్ల ఆసక్తికర వ్యాఖ్యలు
దిశ,వెబ్‌డెస్క్:ఏపీలోని గుంటూరు జిల్లా కలెక్టరేట్‌లో పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర@2047 సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మాట్లాడుతూ.. అమరావతి నిర్మాణం, సేవ, ఉపాధి పై సమీక్ష నిర్వహించామని స్వర్ణాంధ్ర@2047 ప్రణాళిక కోసం సూచనలు తీసుకున్నామని పేర్కొన్నారు. ఈ క్రమంలో యువతకు ఉపాధి పై సమగ్ర ప్రణాళికను అధికారులు సిద్ధం చేశారని చెప్పారు. చేనేత, పర్యాటక కేంద్రంగా గుంటూరు జిల్లా అభివృద్ధికి అధికారులు సూచనలు చేశారని నేతన్నలకు మరింత గుర్తింపు వచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తామని మంత్రి నాదెండ్ల తెలిపారు.
ఈ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు కష్టాల్లో ఉన్న ప్రతిసారీ జనసేన వారికి అండగా నిలబడిందన్నారు. వరదల సమయంలో జనసేన ప్రజలకు అండగా ఉందని మంత్రి నాదెండ్ల చెప్పారు. తిరుపతి లడ్డూ వివాదం సృష్టించిందే వైసీపీ అంటూ నాదెండ్ల ఆరోపించారు. డిప్యూటీ సీఎం పవన్ తీసుకునే నిర్ణయం ఆయన స్వార్థం కోసం, రాజకీయ లబ్ధి కోసం కాదన్నారు. పవన్ నిర్ణయాలు సమాజం కోసం.. దేశం కోసం అని తెలిపారు. ప్రతి ఒక్క కులాన్ని, మతాన్ని గౌరవించుకోవాలని పవన్ చెప్పారని.. ప్రతి ఒక్కరికి సమాన హక్కులు కల్పించాలని పవన్ కళ్యాణ్ పోరాడుతున్నారని మంత్రి తెలిపారు.