- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బైజూస్ పేరుతో వైసీపీని టార్గెట్ చేసిన పవన్ కల్యాణ్
దిశ, డైనమిక్ బ్యూరో: ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని కొంతకాలంగా వాలంటీర్ల పేరుతో టార్గెట్ చేస్తున్న జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఇవాళ విద్యారంగంలో లోపాలను లక్ష్యంగా చేసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా వైసీపీ ఎడ్యుకేషనల్ టెక్ కంపెనీ ‘బైజూస్’తో ఒప్పందం చేసుకుంది. ప్రపంచంతో పోటీపడేలా పిల్లలను సన్నద్ధం చేసేందుకే ఈ ఒప్పందం అని సీఎం జగన్ అన్నారు. ఈ నేపథ్యంలో జనసేన అదినేత పవన్ కల్యాణ్ ఇవాళ ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు. ఏపీలో పాఠశాలలు ఎదుర్కొంటున్న అసలు సమస్యలు ఇవీ అంటూ పేర్కొన్నారు.
రాష్ట్రంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ లేదని, టీచర్ల రిక్రూట్ మెంట్ లేదని, టీచర్లకు శిక్షణ కూడా లేదని, కానీ నష్టాల్లో ఉన్న స్టార్టప్ బైజూస్‌కు మాత్రం ప్రభుత్వ ఒప్పందం చేసుకున్నారని ప్రశ్నించారు. అయితే వైసీపీ ప్రభుత్వం స్టాండర్డ్ ప్రోటోకాల్ అమలు చేస్తుందా లేదా అని అడిగారు. టెండర్ కు ఎన్ని కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయని ప్రశ్నించారు. ఇందులో ఎన్ని షార్ట్ లిస్ట్ చేశారన్నారు. ఇదంతా ప్రజా తెలిసేలా ఉంచారా అని కూడా పవన్ ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం దీనిపై స్పందించాలని డిమాండ్ చేశారు.