- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Pawam Kalyan : ఇకపై ఊరుకునేది లేదు.. మాస్ వార్నింగ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్
దిశ, వెబ్ డెస్క్ : ఏపీ(AP)లో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన 'దీపం 2.0'(Deepam 2.0) పథకంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సంచలన వ్యాఖ్యలు చేశారు. దీపం పథకం వంటింటి కోసమే కాదని ప్రతి ఒక్కరి కడుపు నింపడమే లక్ష్యమని పేర్కొన్నారు. శుక్రవారం ఏలూరు జిల్లా, ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాధపురంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. ఈ ఆలయంలోని స్వామి వారి దయ వల్లే తాము అధికారంలోకి వచ్చామని అన్నారు. ప్రజలు మాపై నమ్మకంతో మమ్మల్ని గెలిపించారని అన్నారు. తమ ప్రభుత్వం మహిళలకు ఆర్థిక చేయూతనివ్వడానికి దీపం పథకానికి శ్రీకారం చుట్టిందని తెలియ జేశారు. ప్రజలకు అన్యాయం చేసిన వైసీపీ(YCP) పార్టీ.. సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు వాగుతున్నారని మండిపడ్డారు. ఇకపై ఏది పడితే అది మాట్లాడితే ఊరుకునేది లేదని మాస్ వార్నింగ్ ఇచ్చారు. తమ కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి లాగితే ఎవ్వరినీ వదలను అని హెచ్చరించారు.
Read More : Pawan Kalyan: సనాతన ధర్మం పరిరక్షణకు ప్రత్యేక విభాగం: పవన్ సంచలన నిర్ణయం