Pawan Kalyan: తిరుమలలో అనూహ్య పరిణామం.. డిక్లరేషన్ ఇచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

by Shiva |   ( Updated:2024-10-02 05:25:28.0  )
Pawan Kalyan: తిరుమలలో అనూహ్య పరిణామం.. డిక్లరేషన్ ఇచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల లడ్డూ కల్తీ వివాదం నేపథ్యంలో 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్షను చేపట్టిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Deputy CM Pawan Kalyan) ఇవాళ దీక్షను విరమించబోతున్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం రాత్రి అలిపిరి (Alipiri) మెట్ల మార్గంలో కాలినడకన తిరుమల (Tirumala) కు చేరుకున్నారు. ఇవాళ ఉదయం శ్రీవారిని దర్శించుకునేందుకు పెద్ద కుమార్తె ఆద్య, చిన్న కుమార్తె పొలెనా అంజనితో శ్రీవారి దర్శనానికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. అయితే, చిన్న కుమార్తె పొలెనా అంజని (Polena Anjani) మైనర్ కావడంతో ఆమె తరఫున పవన్ కల్యాణ్ (Pawan Kalyan) టీటీడీ అధికారుల సమక్షంలో డిక్లరేషన్ ఇచ్చారు. ఆ డిక్లరేషన్ ఫామ్‌లో పొలెనా అంజని (Polena Anjani) కూడా సంతకం చేశారు. అనంతరం మహాద్వారం నుంచి పవన్ కల్యాణ్ ఆలయంలోకి వెళ్లారు. అయితే, రాష్ట్రంలో డిక్లరేషన్ (Declaration) మీద వివాదం కొనసాగుతున్న వేళ పవన్‌ చేసిన పనితో విమర్శలకు చెక్ పెట్టినట్లైంది.

కాగా, శ్రీవారి దర్శనం అనంతరం పవన్ నేరుగా తరిగొండ (Tharikonda) అన్నప్రసాద సముదాయానికి చేరుకోనున్నారు. అక్కడ అన్నప్రసాద సముదాయంలో ప్రసాదాల నాణ్యతను పరిశీలించనున్నారు. అదేవిధంగా అక్కడకి వచ్చే భక్తుల సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. అనంతరం భక్తులతో అక్కడే సహపంక్తి భోజనం చేయనున్నట్లుగా తెలుస్తోంది.

Advertisement

Next Story