- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జనసేన అభ్యర్థులతో ప్రమాణం చేయించిన పవన్ కల్యాణ్
దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయబోయే జనసేన పార్టీ అభ్యర్థుల చేత ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రమాణం చేయించారు. బుధవారం మంగళగిరిలోని పార్టీ కార్యాయలంలో అభ్యర్థులకు బీ-ఫామ్‌లు అందజేశారు. తొలి బీ-ఫామ్‌ను పార్టీ పీఏసీ చైర్మన్ నాదేండ్ల మనోహర్‌కు అందించారు. ఒకేసారి మొత్తం 21 మంది అసెంబ్లీ, 2 ఇద్దరు పార్లమెంట్ అభ్యర్థులకు బీ-ఫామ్‌లు అందజేసి ప్రమాణం చేయించారు. అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడారు. రాష్ట్రంలో దుష్ట పాలన ముగింపు కోసమే కూటమి ఏర్పాటు చేయాల్సి వచ్చిందని అన్నారు.
ఇప్పుడిప్పుడే రాష్ట్రంలో రామ రాజ్యం వైపు అడుగులు పడుతున్నాయని తెలిపారు. కూటమి గెలుపు దాదాపు ఖాయమైందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని మెజార్టీ నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రావని కీలక వ్యాఖ్యలు చేశారు. ఓడిపోతామని తెలిసాకే జగన్‌కు రాళ్ల దాడులు చేయించుకొని కొత్త కుట్రలకు తెరలేపాడని విమర్శించారు. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ-జనసేన-బీజేపీ కలిసి పోటీ చేస్తోన్న విషయం తెలిసిందే. పొత్తులో భాగంగా టీడీపీ 144 అసెంబ్లీ, జనసేన 21, బీజేపీ 6 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయబోతున్నాయి.