మహిళా రిజర్వేషన్ బిల్లుపై స్పందించిన పవన్ కల్యాణ్

by GSrikanth |   ( Updated:2023-09-19 13:17:00.0  )
మహిళా రిజర్వేషన్ బిల్లుపై స్పందించిన పవన్ కల్యాణ్
X

దిశ, వెబ్‌డెస్క్: మహిళా రిజర్వేషన్ బిల్లుకు ప్రధాని నరేంద్ర మోడీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీనిని మంగళవారం సభలో ప్రవేశపెట్టనున్నారు. 33 శాతం మహిళా రిజర్వేషన్‌ బిల్లును ప్రభుత్వం తీసుకువస్తుందని చెబుతున్నారు. ఇప్పుడు ఈ బిల్లు ఆమోదం పొందితే లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించబడతాయి. ఇదే జరిగితే రానున్న ఎన్నికల్లో చాలా రాష్ట్రాల లెక్కలు మారిపోతుంది. ఇదిలా ఉండగా.. కేంద్రం నిర్ణయంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. చట్టసభల్లో మహిళామణుల ప్రాతినిథ్యం పెంచాలనే వనితా లోకం ఆకాంక్షలు నెరవేరే రోజులు సమీపంలోనే ఉన్నాయని అన్నారు.

ఇందుకు అవసరమైన మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం, ప్రస్తుతం నడుస్తున్న పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని అన్నారు. చారిత్రాత్మకమైన ఈ బిల్లు కేబినెట్ సమావేశంలో ఆమోదం పొందేలా కృషి చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. చట్ట సభల్లో 33 శాతం స్థానాలు మహిళలకు దక్కేలా చేసే ఈ బిల్లు విషయమై వాగ్ధానాలు, నినాదాలకు పరిమితం కాకుండా కార్యరూపం దాల్చేలా చేయడంలో ప్రధాని ఎంతో చిత్తశుద్ధి చూపారని కొనియాడారు.

Advertisement

Next Story

Most Viewed