BREAKING: చంద్రబాబుకు ఇంటికి చేరుకున్న పవన్.. మరి కాసేపట్లో ఫస్ట్ లిస్ట్ రిలీజ్

by Satheesh |   ( Updated:2024-02-24 08:22:14.0  )
BREAKING: చంద్రబాబుకు ఇంటికి చేరుకున్న పవన్.. మరి కాసేపట్లో ఫస్ట్ లిస్ట్ రిలీజ్
X

దిశ, వెబ్‌డెస్క్: మరి కాసేపట్లో టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితా విడుదల కానుంది. టీడీపీ చీఫ్ చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కలిసి ఉమ్మడి జాబితాను రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలో ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేరుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్‌కు చంద్రబాబు ఘన స్వాగతం పలికారు. అనంతరం చంద్రబాబు, పవన్, నాదెండ్ల మనోహర్ భేటీ అయ్యారు. ఈ సమావేశం తర్వాత పవన్, బాబు ప్రెస్ మీట్ నిర్వహించి ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయనున్నారు. 118 మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఇందులో టీడీపీకి 85 నుండి 95 స్థానాలు, జనసేనకు 24-25 సీట్లు ఇవ్వనున్నట్లు సమాచారం. టీడీపీ, జనసేనలోని కీలక నేతల పేర్లంతా ఫస్ట్ లిస్ట్‌లోనే ఉండే అవకాశం ఉంది. చంద్రబాబు కుప్పం, పవన్ కల్యాణ్ భీమవరం, నారా లోకేష్ మంగళగిరి, నాదెండ్ల మనోహర్ తెనాలి, అచ్చెన్నాయడు టెక్కలి స్థానాల్లో పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థుల జాబితా విడుదల నేపథ్యంలో ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సీటు దక్కుతుందో లేదో అని ఆశావాహులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Read More..

BREAKING: మరికాసేపట్లో TDP-జనసేన ఫస్ట్ లిస్ట్ రిలీజ్.. పవన్ కల్యాణ్ పోటీ అక్కడినుండే..!

Advertisement

Next Story