- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కుత్తుకలు కోసే దండుపాళ్యం బ్యాచ్‌కు.. వాలంటీర్లకు తేడా లేదు: పవన్ కల్యాణ్ సెన్సేషనల్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: వాలంటీర్ వ్యవస్థపై జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ మరోసారి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. మాజీ వాలంటీర్ వెంకటేష్ చేతిలో దారుణ హత్యకు గురైన వరలక్ష్మి కుటుంబ సభ్యులను శనివారం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. కుత్తుకలు కోసే దండుపాళ్యం బ్యాచ్‌కు.. వాలంటీర్లకు తేడా లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒంటిరి మహిళలు ఉన్న ఇళ్లలోకి చొరబడి వాలంటీర్లు గొంతులు కోస్తున్నారని అన్నారు.
పాస్ పార్ట్ కావాలంటేనే పోలీస్ వెరిఫికేషన్ తప్పని సరి అని.. అలాంటిది వాలంటీర్ల నియామకంలో మాత్రం ఆ పద్దతి పాటించడం లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్ల నియామక ప్రక్రియలోను ఎంపిక చేసే వారిపై పోలీసు వెరిఫికేషన్ జరగాలని పవన్ డిమాండ్ చేశారు. జగన్ ప్రభుత్వం నవరత్నాల కోసం ఏర్పాటు చేసుకున్న ప్రైవేట్ సైన్యం.. ప్రజల ప్రాణాలు తీస్తామంటే ఎలా అని ప్రశ్నించారు. తనకు విధించిన ఆంక్షలు.. వాలంటీర్లకు విధిస్తే ఇన్ని రాష్ట్రంలో ఇన్ని అరచకాలు ఉండవుని ధ్వజమెత్తారు.
కాగా, గతంలోను పవన్ కల్యాణ్ వాలంటీర్ వ్యవస్థపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. వాలంటీర్లు పౌరుల వ్యక్తిగత డేటా సేకరిస్తున్నారని.. వాలంటీర్ వ్యవస్థ ద్వారా రాష్ట్రంలో హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతోందని పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో తీవ్ర దూమారం రేపాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్లు జనసేనకు వ్యతిరేకంగా నిరసనలు చేయగా.. వైసీపీ నేతలు పవన్ కల్యాణ్ విమర్శల దాడి చేశారు. ఈ క్రమంలో పవన్ మరోసారి వాలంటీర్లపై సంచలన వ్యాఖ్యలు చేయడంతో మళ్లీ ఏపీ రాజకీయాలు హీటెక్కే సూచనలు కనిపిస్తున్నాయి.