ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు ఆ నెలలోనే: పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు

by Satheesh |
Janasena chief Pawan Kalyan
X

దిశ, వెబ్‌డెస్క్: రాబోయే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల గురించి జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మంగళగిరిలో ఏర్పాటు చేసిన జనసేన మండల, డివిజన్ అధ్యక్షుల సమావేశానికి పవన్ హాజరై ప్రసగించారు. ఈ ఏడాది డిసెంబర్‌లో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని పవన్ కల్యాణ్ జోస్యం చెప్పారు. జూన్ నుండి జనసేన ప్రచారం మొదలుపెట్టి ప్రజల్లోకి వెళ్తుందని పవన్ స్పష్టం చేశారు.

అధికార వైసీపీని గద్దె దించేందుకు వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా అలయెన్స్‌లు ఉంటాయని పవన్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. త్రిముఖ పోటీలో బలికావడానికి సిద్ధంగా లేనన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన కలిసే వైసీపీని ఓడిస్తాయని పవన్ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లో జనసేన బలమెన మెజార్టీతో గెలవాలని.. ఆ తర్వాత సీఎం సీటు గురించి మాట్లాడుదామని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

Mangalagiri: అది ఎన్టీఆర్‌కే సాధ్యమైంది.. నాకు కుదరదు: పవన్ కల్యాణ్

Next Story

Most Viewed