- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఎప్పుడో చెప్పు చూపిస్తే.. ఇప్పుడు కేసు పెడతారా: దువ్వాడ శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం
దిశ, వెబ్ డెస్క్: వైఎస్ జగన్(YS Jagan) హయాంలో పవన్ కల్యాణ్(Pawan Kalyan)ను అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్‌పై జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ చెప్పు చూపిస్తూ విమర్శలు చేశారు. అందుకు కౌంటర్‌గా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్(MLC Duvvada Srinivas) సైతం పవన్ కల్యాణ్‌కు చెప్పు చూపిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో దువ్వాడ శ్రీనివాస్‌పై జనసేన నేతలు ఫిర్యాదు చేశారు. అయితే అసమయంలో పోలీసులు కేసులు నమోదు చేయలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో జనసేన నాయకులు మరోసారి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు దువ్వాడ శ్రీనివాస్‌పై పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు. విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేశారు.
దీంతో దువ్వాడ శ్రీనివాస్ మీడియా ముఖంగా స్పందించారు. తనపై కేసు నమోదు చేస్తే జగన్‌పై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన పవన్ కల్యాణ్‌పై సైతం కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. తాను పవన్‌పై విమర్శలు చేసే ముందు జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి చెప్పు చూపించి ఘాటు వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. అందుకే తాను కూడా చెప్పులు చూపించానని తెలిపారు. తాను రెండేళ్ల క్రితం విమర్శలు చేస్తే ఇప్పుడు కేసులు పెట్టడమేంటని ప్రశ్నించారు. తనను జనసేన నాయకులు ఘాటు వ్యాఖ్యలు చేశారని, నాలుగు నెలల క్రితం తాను టెక్కలి పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఎందుకు కేసులు నమోదు చేయలేదన్నారు. శాసనమండలిలో మద్యంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే తనపై కేసులు నమోదు చేశారని ఆరోపించారు. తమ ఇంటి వద్దకు వచ్చి చంపేస్తామని జనసేన నాయకులు బెదిరించారని, వారిపైనా కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. తనపై ఎన్ని కేసులు పెట్టినా అదిరిలేది, బెదిరేది లేదని దువ్వాడ శ్రీనివాస్ వ్యాఖ్యానించారు.