ఆ కారణం చేతనే అన్నయ్య చిరంజీవి పార్టీకి విరాళం ఇచ్చారు: పవన్ కల్యాణ్

by GSrikanth |   ( Updated:2024-04-11 15:14:11.0  )
Pawan Kalyan: మైండ్ గేమ్ పాలిటిక్స్‌పై పవన్ కల్యాణ్ ఆసక్తికర కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: రైతుల కోసమే పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్లు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. గురువారం తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి అంబాజీపేటలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. సర్ ఆర్థర్ కాటన్‌లా రైతుల కోసం పనిచేస్తా అని అన్నారు. అమలాపురం పార్లమెంట్ రైతులకు అండగా ఉంటానని భరోసా కల్పించారు. సినిమాల్లోనే ఉంటే కోట్లు సంపాదించుకునే వాడిని.. యువత, ఆంధ్ర ప్రజల భవిష్యత్ కోసం రాజకీయాల్లోకి వచ్చి అందరి చేతా తిట్టించుకుంటున్నానని అన్నారు.

అన్నయ్య చిరంజీవి నా మంచి కోరుకునే వ్యక్తి అని తెలిపారు. రైలు రైతులకు అండగా ఉండాలని పార్టీకి విరాళం ఇచ్చారని అన్నారు. కాకినాడలో మాఫియా డాన్‌ను తరిమేస్తా అని కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలను ఆర్థికంగా బలోపేతం చేస్తామని హామీ ఇచ్చారు. ఐదేళ్ల రాక్షస పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. వైసీపీ పాలనలో నిత్యావసర వస్తువుల ధరలు, పన్నులు పెంచారని మండిపడ్డారు. చెత్త మీద కూడా పన్ను వేసిన చెత్త ముఖ్యమంత్రి జగన్ అని ఎద్దేవా చేశారు. మంచి నీళ్లు అడిగితే కోనసీమ వాసులు కొబ్బరి నీళ్లు ఇచ్చే మంచి సంస్కారం ఇక్కడ ఉందని తెలిపారు.

Advertisement

Next Story