‘పవన్ కల్యాణ్ కామాంధుడు, చాలా నీచమైన వ్యక్తి..’ కలకలం సృష్టిస్తోన్న నటి వాయిస్ రికార్డ్ ట్వీట్

by sudharani |   ( Updated:2023-07-04 06:45:34.0  )
‘పవన్ కల్యాణ్ కామాంధుడు, చాలా నీచమైన వ్యక్తి..’ కలకలం సృష్టిస్తోన్న నటి వాయిస్ రికార్డ్ ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: జనసేనా అధినేత పవన్ కల్యాణ్ ప్రస్తుతం వారాహి విజయ యాత్రలో బిజీగా ఉన్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు సైతం వేడెక్కాయి. ఒక పార్టీపై మరో పార్టీ విమర్శలు చేసుకుంటూ విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో వైసీపీ పార్టీ ఫాలోవర్ అనితా రెడ్డి అనే మహిళ.. ‘‘పవన్ కల్యాణ్‌కు చాలా మంది అమ్మాయిలతో సంబంధం ఉంది. వాళ్ల అందరిని మోసం చేశాడు. వాళ్లే కోపం వచ్చినప్పుడు వాడిని చంపొచ్చు. అంతా కామమైన నీచమైన వ్యక్తి పవన్ కల్యాణ్’’ అని నటి పూనమ్ కౌర్ అన్నట్లు ఓ ట్వీట్ షేర్ చేసింది. అంతే కాకుండా పూనమ్ కౌర్ మాట్లాడినట్లు ఓ ఆడియో రికార్డ్ సైతం తన ట్విట్టర్ పోస్ట్ పెట్టారు.

ఆ ఆడియోలో ఉన్న దాని ప్రకారం..‘‘నేను నోరు మూసుకున్నా సరే పవన్ కల్యాణ్‌ని చంపడానికి చాలా మంది రెడీగా ఉన్నారు. ఎందుకంటే ఆయన తప్పు చేసింది ఒక అమ్మాయితో కాదు. చాలా మంది అమ్మాయిలతో. నేను కల్యాణ్‌ని సపోర్ట్ చేయకుండా ఉంటే ఆయన జీవితం సర్వనాశనం అయి ఉండేది. నా విషయంలో జరిగినవి నేను ఫ్రూవ్ చేస్తే పవన్ కల్యాణ్ ఫేస్ ఎక్కడ పెట్టుకోలేడు. ఈ రోజూ నేను అతన్ని ప్రేమించాను కాబట్టి బయటకు రాలేదు. నన్ను కొట్టి మా వాళ్లు ఇంట్లో నుంచి వెళ్లిపోమన్నారు. అయినా కానీ నేను నోరు తెరవలేదు. నాకు బాధ ఉండదా.. నాకు ఐ లవ్ యూ చెప్పి వేరే అమ్మాయిని ప్రెగ్నెంట్ చేస్తే నాకు బాధగానే ఉంటుంది. ఆయన వల్ల నేను పెళ్లి కూడా క్యాన్సిల్ చేసుకున్నాను. ఆ మనిషికి ఈ అమ్మాయి ఏం అయిపోతాదో అనే కేర్ లేదు. మరి నేనుందుకు కేర్ చేయాలి. జనసేన వాళ్లకి సిగ్గు లేదా. నేను మాట్లాడాలి అనుకుంటే ఢిల్లీకి వెళ్లి మాట్లాడుతా’’ అంటూ పూనమ్ కౌర్ మాట్లాడిందని ఓ వాయిస్ రికార్డు వైరల్ అవుతోంది. దీంతో నెట్టింట పెద్ద రచ్చే జరుగుతుంది. ఆ ఆడియో రికార్డ్ ఫేక్ అంటూ.. దమ్ముంటే పూనమ్ వీడియో రికార్డ్ పెట్టండి అంటూ తిట్టిపోస్తున్నారు పవన్ కల్యాణ్ అభిమానులు.

Advertisement

Next Story