- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
AP Deputy CM:ఫిష్ వెంకట్‌కు పవన్ కల్యాణ్ ఆర్థిక సాయం
దిశ,వెబ్‌డెస్క్: టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్(Fish Venkat) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయనకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(AP Deputy CM Pawan Kalyan) అండగా నిలిచారు. ఈ విషయాన్ని ఆయన తాజాగా ట్విట్టర్(Twitter) వేదికగా వెల్లడించారు. ఈ నేపథ్యంలో అనారోగ్యం కారణంగా సినిమాలకు దూరం కావడంతో ఫిష్ వెంకట్ ఆర్థికంగాను ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు.
ఈ క్రమంలో చాలా మంది ప్రముఖ నటులు తెలుసు కనుక ఈ కష్టసమయంలో ఎవరినైనా సాయం కోరాలని కుటుంబ సభ్యులు సూచించినట్లు ఆయన పేర్కొన్నారు. దాంతో సాయం విషయమై తన భార్య సువర్ణ ఒత్తిడి మేరకు పవన్ కళ్యాణ్(Pawan Kalyan)ను కలిసినట్లు వెంకట్ పేర్కొన్నారు. పవన్‌ను కలిసి, తన అనారోగ్య సమస్యను వివరించడంతో వెంటనే అన్ని విధాలా సహాయం చేస్తానని హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. అలాగే తన ఆర్థిక ఇబ్బందులను గమనించి తన బ్యాంకు ఖాతా(Bank Account)లో వెంటనే రూ. 2 లక్షలు జమ చేయించారని వెంకట్ పేర్కొన్నారు. తనను ఈ కష్టకాలంలో ఆదుకున్న పవన్ కల్యాణ్, ఆయన కుటుంబం ఎప్పుడూ ఆనందంగా ఉండాలని దేవుడిని కోరుకుంటున్నానని నటుడు వెంకట్ ఎమోషనల్ అయ్యారు.