పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసిన పవన్ కల్యాణ్

by Disha Web Desk 4 |
పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసిన పవన్ కల్యాణ్
X

దిశ, వెబ్‌డెస్క్: జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా కాసేపటి క్రితం నామినేషన్ వేశారు. హనుమాన్ జయంతి రోజున పవన్ కల్యాణ్ భారీ ర్యాలీగా వచ్చి నామినేషన్ పత్రాలను అధికారులకు అందజేశారు. నామినేషన్ వేసే సందర్భంలో పిఠాపురం టీడీపీ ఇన్‌ఛార్జి వర్మ, జనసేన ముఖ్యనేత నాగబాబు పవన్ వెంట ఉన్నారు. అంతకు ముందు పవన్ కల్యాణ్ ర్యాలీకి భారీగా జనం తరలివచ్చారు. ఎన్డీఏ కూటమిలో భాగంగా బీజేపీ, టీడీపీ పార్టీలు పవన్ కల్యాణ్‌కు మద్దతు తెలుపుతుండగా టీడీపీ, బీజేపీ శ్రేణులు సైతం పవన్ నామినేషన్ ర్యాలీకి తరలివచ్చారు. దీంతో పవన్ కల్యాణ్ ర్యాలీ దారి పొడవునా.. జన సంద్రాన్ని తలపించింది. ఇక, ఈ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా వంగా గీత పోటీలో ఉన్న విషయం తెలిసిందే.



Next Story

Most Viewed