- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నారా భువనేశ్వరిని ఓదార్చిన పవన్ కల్యాణ్
దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరిని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరామర్శించారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న చంద్రబాబు నాయుడును ములాఖత్‌లో భాగంగా పవన్ కల్యాణ్ కలిశారు. చంద్రబాబు తనయుడు లోకేశ్, నందమూరి బాలకృష్ణలతో కలిసి పవన్ కల్యాణ్ కలిసి పరామర్శించారు. జైలులో చంద్రబాబు యోగ క్షేమాల గురించి అడిగి తెలుసుకున్నారు. జైలులో చంద్రబాబు నాయుడు భద్రతపై పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ త్వరలోనే ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలతో భేటీ అయి తాజా పరిణామాలను వివరించనున్నట్లు పవన కల్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అనంతరం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి నేరుగా నారా లోకేశ్ బస చేసిన క్యాంప్ కు వెళ్లారు. అక్కడ భువనేశ్వరి, బ్రహ్మణిలను పరామర్శించి ఓదార్చారు. త్వరలోనే చంద్రబాబు నాయుడు బయటకు వస్తారని తెలిపారు. కడిగిన ముత్యంలా స్కిల్ స్కామ్ కేసు నుంచి చంద్రబాబు బయటకు వస్తారని తెలిపారు. ఇలాంటి పరిస్థితులు బాధాకరమైనప్పటికీ ధైర్యంగా ఉండాలని పవన్ కల్యాణ్ భువనేశ్వరిని ఓదార్చారు. ఈ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ, లోకేశ్ ఇతర టీడీపీ నేతలు ఉన్నారు.