MP అభ్యర్థులను ప్రకటించిన పవన్ కల్యాణ్

by GSrikanth |   ( Updated:2024-03-30 07:04:06.0  )
Janasena Chief Pawan Kalyan Demands Bharat Ratna for Pingali Venkayya
X

దిశ, వెబ్‌డెస్క్: పొత్తులో భాగంగా జనసేన పార్టీకి రెండు పార్లమెంట్ స్థానాలు దక్కిన విషయం తెలిసిందే. తాజాగా ఈ రెండు స్థానాలకు అధినేత పవన్ కల్యాణ్ అభ్యర్థులను ప్రకటించారు. ఇప్పటికే కాకినాడ అభ్యర్థిగా తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్‌ను ప్రకటించిన పవన్ కల్యాణ్.. ప్రస్తుతం మచిలీపట్నం ఎంపీగా అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి పేరును ఖరారు చేశారు. మరోవైపు మొత్తం 21 మందిలో 18 మంది అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. మరో ముగ్గురిని ప్రకటించాల్సి ఉంది. టీడీపీ, బీజేపీతో కలిసి జనసేన కూటమిగా బరిలోకి దిగుతోంది. ఈ నేపథ్యంలో పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ, 2 ఎంపీ సీట్లను కేటాయించారు.

Read More..

Breaking news: టీడీపీలో చేరిన ప్రముఖ టాలీవుడ్ హీరో

Advertisement

Next Story