- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పవన్! అప్పుడు నోట్లో హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకున్నావా?: మంత్రి రోజా
దిశ, డైనమిక్ బ్యూరో : జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను మెంటల్ ఆస్పత్రిలో చేర్పించాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్‌కే రోజా అన్నారు. రుషికొండ వద్ద పవన్ కల్యాణ్ ఊగుడు చూస్తుంటే ఆయనను మెంటల్ ఆస్పత్రిలో చేర్పించాల్సిన సమయం ఆసన్నమైందని అర్థమవుతుంది అని చెప్పుకొచ్చారు. రుషికొండపై నిర్మాణాలు కోర్టు అనుమతులుతో చట్టబద్ధంగా నిర్మాణాలు జరుగుతున్నాయని వివరణ ఇచ్చారు. రుషికొండ మీద ఉండేది టూరిజం స్థలం అని దాంట్లోనే నిర్మాణాలు జరుగుతున్నాయని తెలిపారు. నిర్మాణాలను అడ్డుకునేందుకు టీడీపీ,జనసేన, ఎంపీ రఘురామ కృష్ణంరాజులు కోర్టులను ఆశ్రయించారని కోర్టులు కూడా అనుమతి ఇచ్చాయని రోజా వివరించారు. అంతేకాదు ఎన్జీటీకి వెళ్లి నిర్మాణాలను అడ్డుకోవాలని చూశారని కానీ అక్కడ కూడా వీరందరికీ చుక్కెదురు అయ్యిందని రోజా చెప్పుకొచ్చారు. రుషికొండపై ప్రభుత్వం నిర్మిస్తున్న నిర్మాణాలపై పవన్ కల్యాణ్ విషం చిమ్ముతున్నారని ధ్వజమెత్తారు. రుషికొండకు ఎదురుగా బాలకృష్ణ అల్లుడు,నారా లోకేశ్ తోడల్లుడు భరత్ ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తే పవన్ కల్యాణ్ ఎందుకు నోరు తెరవడం లేదని ప్రశ్నించారు. అప్పుడు పవన్ కల్యాణ్ నోట్లో హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకున్నారా అని మంత్రి ఆర్ కే రోజా మండిపడ్డారు. ఈ మేరకు ఆదివారం ఓ వీడియో విడుదల చేశారు. పవన్ కల్యాణ్ ఓ ఎంపీకాదు, ఎమ్మెల్యే కాదు కనీసం వార్డు మెంబర్ కూడా కాదని అన్నారు. ఏ అర్మత లేని పవన్ కల్యాణ్ పిచ్చి కూతలు కూస్తున్నారని మంత్రి ఆర్ కే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎవరూ అడ్డుకోలేరు
విశాఖ బ్రాండ్‌ను దెబ్బతీసేందుకు పవన్ కల్యాణ్ ప్రయత్నిస్తున్నారని మంత్రి ఆర్‌కే రోజా ఆరోపించారు. కోర్టు అనుమతితోనే నిర్మాణాలు చేపడుతున్నా అనవసర రాద్ధాంతం చేస్తున్నారని రోజా మండిపడ్డారు.సుప్రీంకోర్టు, హైకోర్టులే నిర్మాణాలకు అనుమతి ఇచ్చిందని న్యాయస్థానాల కన్నా పవన్ కల్యాణ్ గొప్పేం కాదని అన్నారు. పవన్ కల్యాణ్ విశాఖపట్నంపై ఇలానే విమర్శలు చేస్తే తరిమితరిమి కొడతారని హెచ్చరించారు. ఉత్తరాంధ్రలో వెనుకబడిన ప్రాంతం అయిన విశాఖపట్నంను అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కంకణం కట్టుకుంటే దానిపై విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. విశాఖ బ్రాండ్ విషం చిమ్ముతున్నారని ధ్వజమెత్తారు.విశాఖను క్రైమ్ సిటీగా ప్రచారం చేస్తున్నారని.. ఇది విశాఖ ప్రజల మనోభవాలకు దెబ్బతీసినట్లేనని చెప్పుకొచ్చారు. చంద్రబాబు హయాంలో ఆయనకు కావాల్సిన వాళ్లకు భూములు ఇచ్చారు. అప్పుడు ఈ నిబంధనలు గుర్తుకు రాలేదా? అని మంత్రి ఆర్‌కే రోజా నిలదీశారు. రుషి కొండ మీద జరిగే నిర్మాణాలను పవన్ కల్యాణ్, చంద్రబాబులు అడ్డుకోలేరని మంత్రి ఆర్‌కే రోజా ధీమా వ్యక్తం చేశారు.
- Tags
- Minister Rk Roja