ఆ ఎన్నికల్లో మా ఓటమి ప్రజాస్వామ్య ఓటమి.. మాజీమంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు

by Ramesh Goud |
ఆ ఎన్నికల్లో మా ఓటమి ప్రజాస్వామ్య ఓటమి.. మాజీమంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: ఆ ఎన్నికల్లో మా ఓటమి ప్రజాస్వామ్య ఓటమి అని మాజీమంత్రి (Former Minister), వైఎస్ఆర్సీపీ నేత ఆర్కే రోజా (YSRCP Leader RK Roja) అన్నారు. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక (Thirupati Deputy Mayor Elections) గత రెండు రోజులుగా ఏపీలోని అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వివాదంగా మారింది. ఎట్టకేలకు మంగళవారం జరిగిన ఎన్నికలో కూటమి అభ్యర్థి (NDA Candidate) విజయం సాధించారు. దీనిపై రోజా ట్విట్టర్ (Twitter) వేదికగా స్పందిస్తూ.. కూటమి ప్రభుత్వం (NDA Government)పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆమె.. తిరుపతి నగర పాలక సంస్థ ఉప మేయర్ ఎన్నికల్లో (Tirupati Municipal Corporation Deputy Mayor election) మా అభ్యర్థి ఓటమి ప్రజాస్వామ్య ఓటమి (democratic defeat) అని వ్యాఖ్యానించారు.

తిరుపతి నగర పాలక సంస్థ మేయర్ అయిన డా.శిరీషని (Mayor Sirisha) విధుల నిర్వహణలో అవమానించారని తెలిపారు. తిరుపతి మున్సిపల్ కార్పోరేషన్ సమావేశం లోపల జరుగుతుంటే బయట మేయర్ శిరీష ఆందోళన చేసే పరిస్థితి ఏర్పడటం దేనికి సంకేతం? అని ప్రశ్నించారు. అలాగే తిరుపతి ఎంపి మద్దిల గురుమూర్తి (Tirupati MP Maddila Gurumurthy) ప్రయాణిస్తున్న బస్సు పై దాడి, నిన్న బస్సులో బయలు దేరిన వైఎస్ఆర్సీపీ పార్టీ కార్పొరేటర్లు (YSRCP party corporators) నేడు రాకపోవడం, మాతో నిన్న వచ్చి నేడు మాకు వ్యతిరేకంగా ఓటు వేయడం నిన్న రాత్రి జరిగిన పరిణామాలకు కొనసాగింపు కాదా? అని మండిపడ్డారు.

అంతేగాక ఒక్క ఓటు ఉన్న టీడీపీ పార్టీ (TDP Party) కార్పొరేటర్ గెలిచారని, మేము విప్ జారీ చేశామని తెలిపారు. రిటర్నింగ్ అధికారి మా సభ్యులు విప్ దిక్కరించినందున వారిని అనర్హులుగా ప్రకటించాలి కానీ అవేమీ జరగలేదని అన్నారు. అంటే ఎన్నికలు ఎంత ప్రజాస్వామ్య బద్ధంగా జరిగాయో అర్దం అవుతుందని దుయ్యబట్టారు. అంతిమంగా ఒకటే చెపుతున్నా.. `మేము ఓడి గెలిచాం వాళ్ళు గెలిచి ఓడిపోయారు` అని అన్నారు. మేము ఓడిపోలేదు.. వ్యవస్థల ఉదాసీన వైఖరి, అధికార దుర్వినియోగం గెలిచిందని, స్వామి (Swami) వారితోపాటు ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. సమయం వచ్చినప్పుడు సమాధానం చెపుతారు..!! అని రోజా రాసుకొచ్చారు.

Next Story