- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking: టీటీడీ ఈవో ధర్మారెడ్డికి లీవ్ ఇస్తూ ఉత్తర్వులు
దిశ, వెబ్ డెస్క్: గత ప్రభుత్వంలో కొందరు అధికారులు స్వామి భక్తి చూపించారు. వైసీపీ నాయకులకు నమ్మిన బంటులా పని చేశారు. సాక్షాత్తు ఆ ఏడు కొండల స్వామి చెంతన సైతం చెత్తగా వ్యవహరించారు. దీంతో వారిపై ప్రస్తుత ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ విషయాన్ని అర్థం చేసుకున్న కొందరు అధికారులు తెలివిగా వ్యవహరిస్తున్నారు. ముఖం చాటుకునేందుకు తమకు లీవులు కావాలని కోరుతున్నారు. ఈ మేరకు సీఎస్ నీరబ్ కుమార్కు విజ్ఞప్తి చేస్తున్నారు. దీంతో ఆయన వెంటనే అనుమతిస్తున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేసిన జవహర్ రెడ్డికి ఇప్పటికే లీవ్ మంజూరు చేశారు. ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శిగా పని చేసిన రావత్ సైతం లీవు పెట్టి సెలవులపై వెళ్లారు.
ఇప్పుడు తాజాగా మరో ఉన్నతాధికారి సైతం వాళ్ల బాటలోనే నడిచారు. గత ప్రభుత్వంలో వైసీపీ నాయకులకు అన్ని తానై సేవలు చేశారు. ఇప్పుడు ఆ ఫలితం అనుభవిస్తున్నారు. ప్రభుత్వం మారడంతో టీటీడీ ఈవో ధర్మారెడ్డి తనకు సెలవులు కావాలని ఇందుకు వారం రోజులు లీవ్ ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ కోరారు. దీంతో సీఎస్ వెంటనే అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ నెలఖారుకే ధర్మారెడ్డి పదవీ విరమణ చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఏడు రోజుల పాటు లీవ్ తీసుకున్నారు. మరి ఏడు రోజుల తర్వాత మళ్లీ ఉద్యోగంలో చేరతారా..? లేదా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.