Andhra Pradesh News: ఆచంట YCP లో మంట.. దూసుకుపోతున్న TDP Incharge

by sudharani |   ( Updated:2023-07-31 16:04:36.0  )
Andhra Pradesh News: ఆచంట YCP లో మంట.. దూసుకుపోతున్న TDP Incharge
X

దిశ, ఉభయ గోదావరి ప్రతినిధి: ఆచంట నియోజకవర్గంలో వైసీపీకి ఎదురు గాలి వీస్తోంది. ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలోనే మంత్రి పదవి పొంది అధిష్టానం వద్ద తనకున్న పట్టును చాటుకొన్న మాజీ మంత్రి శ్రీరంగరాజు ప్రస్తుతం ఎదురీతలో పడ్డారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీజనంలో ఆయనకు వ్యతిరేకత పెరిగిపోతుంది. క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన శ్రీరంగరాజు స్థానికంగా మైనార్టీ అవ్వడం, దీనికి తోడు జనానికి రుచించకపోవడంతో పార్టీ కేడర్ అయోమయంలో పడింది. వచ్చే ఎన్నికలలోపు కొత్త అభ్యర్థిని రంగంలోకి దించాలనే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. అంతేగాక శ్రీరంగ రాజు వ్యవహారంపై అధిష్టానం గుర్రుగా ఉంది. ప్రజా సమస్యలను పట్టించుకోవడం స్వయంగా పార్టీ కార్యకర్తలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

జగన్ అనుకూలతతో..

ఆచంట శాసన సభ్యుడు శ్రీరంగ రాజు గతంలో రైసు మిల్లర్ల అధ్యక్షుని సేవలు అందించారు. బాగా స్థితిమంతుడు అనే పేరు కూడా ఉంది. వైసీపీ అధిష్టానంతో పూర్వం నుంచి మంచి సంబంధాలు ఉన్నాయి. దీంతో 2019లో సీటు సాధించుకొన్నారు. తర్వాత వైసీపీ హవాలో విజయం సాధించారు. వెంటనే ముఖ్యమంత్రి తొలి కేబినెట్ లోనే గృహ నిర్మాణ శాఖ మంత్రిగా బాధ్యతలు అప్పచెప్పారు. అయితే మంత్రి హోదాలో ఆయన ఎన్నడూ కూడా ప్రజలను పట్టించుకోలేదనే ప్రచారం సాగుతుంది. దీంతో రెండో విడత విస్తరణ వచ్చేసరికి కేబినెట్ నుంచి తప్పించారు. అప్పటికే ముఖ్యమంత్రి జగన్ శ్రీరంగ రాజు గురించి పలు విషయాలు రప్పించుకొన్నారు.

2024లో సీటు డౌటే..

అంతేగాక తాజాగా సర్వేల్లో శ్రీరంగ రాజునకు వ్యతిరేకంగా అనేక మంది తమ అభిప్రాయాలు చెప్పారు. దీంతో వాటి వివరాలు చూసిన అధిష్టానం తల పట్టుకుంటుంది. గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమం సక్రమంగా నిర్వహించకపోవడం, ప్రజలు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వకపోవడం వంటివి చేస్తున్నారట. అంతేగాక తన కార్యాలయం వద్దకు ఎవరైనా వస్తే వారిని లోపలికి రానీయకుండా చాలా సేపు బయటే నిలబెట్టడం వంటివి కూడా చేస్తున్నారు. విషయం అంతా అధిష్టానం దాకా వెళ్లింది. వచ్చే ఎన్నికల్లో మంచి యువతరం కోసం నిరీక్షణలో పడింది. దీంతో శ్రీరంగరాజుకు సీటు డౌటే అనే టాక్ వచ్చింది.

ఇవి కూడా చదవండి మాగోడు వినండి: Ambati Rayudu కు నిరసన సెగ

Advertisement

Next Story

Most Viewed