మరోసారి సీఐడీ విచారణకు RGV గైర్హాజరు.. రేపు మళ్లీ నోటీసులు?

by Jakkula Mamatha |   ( Updated:2025-02-10 11:00:17.0  )
మరోసారి సీఐడీ విచారణకు RGV గైర్హాజరు.. రేపు మళ్లీ నోటీసులు?
X

దిశ,వెబ్‌డెస్క్: గుంటూరు(Guntur) సీఐడీ(CID) విచారణకు నేడు(సోమవారం) డైరెక్టర్ రాంగోపాల్ వర్మ(ఆర్జీవీ) గైర్హాజరయ్యారు. ఈ క్రమంలో RGV తరఫున న్యాయవాదిని సీఐడీ కార్యాలయానికి పంపారు. తాను సినిమా ప్రమోషన్‌లో ఉన్నందున విచారణకు రాలేనని పేర్కొంటూ.. 8 వారాల గడువును డైరెక్టర్ ఆర్జీవీ(Director RGV) కోరారు. దీంతో రేపు(మంగళవారం )మళ్లీ నోటీసులు ఇవ్వాలని పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే.. రాంగోపాల్‌ వర్మ(Ramgopal Varma) 2019లో ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ పేరుతో మూవీ తెరకెక్కించారు. ఆ సినిమా పేరు పై తెలంగాణ హైకోర్టు(Telangana Hiలో కొందరు పిల్ వేయడంతో ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ అనే పేరుతో విడుదల చేశారు. అయితే యూట్యూబ్‌లో మాత్రం ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ పేరుతోనే విడుదల చేశారంటూ సీఐడీ పోలీసులకు కొందరు ఫిర్యాదు చేశారు. అందులో ఉద్రేకపూరిత దృశ్యాలు తొలగించలేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కేసుకు సంబంధించి నోటీసులను ఆర్జీవీకి ఇటీవల ఒంగోలులో సీఐడీ అధికారులు అందజేసిన విషయం తెలిసిందే.

Next Story

Most Viewed