మరోసారి చంద్రబాబు పవన్ కల్యాణ్ భేటీ

by Mahesh |   ( Updated:2024-03-21 08:33:06.0  )
మరోసారి చంద్రబాబు పవన్ కల్యాణ్ భేటీ
X

దిశ, వెబ్ డెస్క్: 2024 ఏపీ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే రెండు విడతల్లో అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ.. రేపు మరో లిస్టులో పూర్తి అభ్యర్థులను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చంద్రబాబు నాయుడు గురువారం హైదరాబాదలోని బాబు నివాసంలో భేటీ అయ్యారు. జనసేన, బీజేపీ కెటాయించిన సీట్ల కాకుండా.. మిగిలిన వాటిలో కేటాయింపులపై క్లారిటీపై ఇరు పార్టీల అధినేతల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, రేపు టీడీపీ ప్రకటించ బోయే అభ్యర్థులపై ప్రధాన చర్చ జరుగుతున్నట్లు తెలుస్తుంది. అలాగే రేపే బీజేపీ కూడా తమ ఎంపీ అభ్యర్థులను ప్రకటించనుంది. దీంతో వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై బాబు, పవన్ చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. కాగా ఏపీలో పార్లమెంట్ ఎన్నికలతో కలిపి అసెంబ్లీ ఎన్నికలు నాలుగో విడతలో జరగనున్నాయి. మే 13 న పోలీంగ్, జూన్ 4 న పలితాలు వెలుబడనున్నాయి.

Read More..

Breaking News: శ్రీవారి సేవలో నారా కుటుంబం

Advertisement

Next Story