సముద్రం ఒడ్డున విజయసాయిరెడ్డి నిర్మాణం.. భారీ బందోబస్తు మధ్య కూల్చివేత

by srinivas |
సముద్రం ఒడ్డున విజయసాయిరెడ్డి నిర్మాణం.. భారీ బందోబస్తు మధ్య కూల్చివేత
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖ జిల్లాలో అక్రమకట్టణాలపై అధికారులు కొరడా ఝులిపించారు. భీమిలి(Bhimili)లోని సముద్రం ఒడ్డున అక్రమ నిర్మాణాలను నేలమట్టం (Demolish) చేశారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి (Ycp Mp Vijayasai Reddy) నిర్మాణాన్ని సైతం కూల్చివేశారు. గతంలోనే కొంత భాగాన్ని కూల్చివేసిన అధికారులు.. తాజాగా అదే కట్టడానికి సంబంధించిన ప్రహరీ గొడను భారీ బందోబస్తు మధ్య తొలగించారు. దీంతో విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కూల్చివేతను పిల్ల చేష్టలతో పోల్చారు. సోషల్ మీడియా ద్వారా విజయసాయిరెడ్డి ఘాటుగా స్పందించారు.

విశాఖ ఎంపీ భరత్ (Visakha MP Bharat), మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) కుమ్మకై రాజకీయ కక్షతో భీమిలిలో తమ ప్రైవేట్ స్థలం ప్రహరీని పగలగొట్టారని విజయసాయిరెడ్డి మండిపడ్డారు. కృష్ణా నది (Krishna River) కరకట్టపై సీఎం నారా చంద్రబాబు నాయుడు (Cm Nara Chandrababu Naidu) నివసిస్తున్న అక్రమ కొంపను నిబంధనల ప్రకారమే కూల్చమని పలుసార్లు విజ్ఞప్తి చేశామని చెప్పారు. బుద్ధిహీనత వల్ల తమరు అది చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నిఖార్సయిన నాయకుడైతే తమ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు.

‘‘తిరుమల వెయ్యికాళ్ల మండపం ఎందుకు కూల్చావు. విజయవాడలో 50కు పైగా గుడులను ఎందుకు కూల్చావు. దుర్గమ్మ గుడిలో క్షుద్ర పూజలు ఎందుకు చేశావు. బూట్లు వేసుకుని ఎందుకు పూజలు చేస్తున్నావు. రాష్ట్రంలో విగ్రహాలు ధ్వంసం చేసి మాపై నిందలు ఎందుకు వేశావు. పవిత్రమైన తిరుమల లడ్డూ ప్రసాదంపై ఎందుకు విషప్రచారం చేశావు.’’ అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.

‘‘ప్రసాదంలో ఏ కల్తీ లేదు. ఆరోపణలే తప్ప నిరూపణలు ఉండవు. దేవుడు క్షమించడు. చంద్రబాబులాంటి వ్యక్తి పాలకుడు కావడం తెలుగు జాతి దురదృష్టం.’’ అని విజయసాయిరెడ్డి విమర్శించారు.

Next Story

Most Viewed