- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీ నెక్ట్స్ సీఎం అతడే.. NTR సతీమణి సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు ఇటీవల ఎన్నికలు ముగియడంతో జూన్ 4న వెలువడే ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది..? ఆంధ్రప్రదేశ్ నెక్ట్స్ సీఎం ఎవరు అవుతారు..? అన్న అంశాలపై స్టేట్ పాలిటిక్స్‌లో జోరుగా చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ తదుపరి ముఖ్యమంత్రి ఎవరూ అన్నదానిపై టీడీపీ వ్యవస్థాపకులు, మాజీ సీఎం ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ 101 జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆమె నివాళులు ఆర్పించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్ ఆశీస్సులతో జూన్ 9వ తేదీన జగన్ రెండోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తారని కీలక వ్యాఖ్యలు చేశారు.
ఆయన ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్‌లో మంచి పాలన జరగాలని కోరుకుంటున్నానని అన్నారు. ఎన్టీఆర్ మరణించినా ఇప్పటికీ కోట్లాది మంది మనస్సుల్లో బతికే ఉన్నారని ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ప్రజల కోసం బతికిన మనిషి ఎన్టీఆర్ అని ఈ సందర్భంగా లక్ష్మీపార్వతి భర్తను గుర్తు చేసుకున్నారు. ప్రాంతీయ పార్టీ స్థాపించిన అనతికాలంలోనే దేశంలో నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేసిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కుతుందని, అలాంటి గొప్ప వ్యక్తికి భార్యను అవ్వడం అదృష్టంగా భావిస్తున్నానని ఆమె పేర్కొన్నారు. కాగా, గత కొంతకాలంగా లక్ష్మీపార్వతి సీఎం జగన్, వైసీపీకి మద్దతుగా నిలుస్తోన్న విషయం తెలిసిందే.