వరదలపై వదంతులను నమ్మవద్దు: Collector Srujana

by srinivas |
వరదలపై వదంతులను నమ్మవద్దు: Collector Srujana
X

దిశ, ఏపీ బ్యూరో: బుడమేరుకు మళ్లీ వరద అంటూ వస్తున్న వదంతులు నమ్మొద్దని, ఎలాంటి భయాందోళనలకు గురికావద్దని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన బుధవారం తెలిపారు. బుడమేరులో ప్రమాదకరస్థాయిలో నీళ్లు లేవని రాష్ట్ర ప్రభుత్వం వరద నియంత్రణకు పటిష్ట కార్యాచరణతో పనిచేస్తున్నట్లు తెలిపారు. ఒకవేళ మళ్లీ వరద వచ్చే పరిస్థితి ఉంటే ముందే సమాచారమిచ్చి అప్రమత్తం చేయడం జరుగుతుందని వివరించారు. ప్రస్తుతం బుడమేరులో ప్రమాదకర స్థాయిలో నీళ్లు లేవని తెలిపారు. అదేవిధంగా ప్రకాశం బ్యారేజీ కి కూడా వరద ప్రవాహం తగ్గిందని, బుధవారం రాత్రి 8 గంటలకు 3,08,083 క్యూసెక్కుల డిశ్చార్జ్ ఉందని తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితిని తీసుకొచ్చేందుకు ప్రభుత్వ యంత్రాంగం రాత్రింబవళ్లు పనిచేస్తోందని పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయం కేంద్రంగా ఎప్పటికప్పుడు పరిస్థితులను అంచనా వేసుకుంటూ ప్రణాళికల ప్రకారం ప్రత్యేక బృందాలు సేవలందిస్తున్నాయని కలెక్టర్ వివరించారు. ఆహారం, స్వచ్ఛమైన తాగునీరు, అవసరమైన మందుల వంటివి అందిస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed