నూకలున్నాయ్: ట్రైన్ కింద పడి ప్రాణాలతో బయటపడ్డ వ్యక్తి

by Seetharam |
నూకలున్నాయ్: ట్రైన్ కింద పడి ప్రాణాలతో బయటపడ్డ వ్యక్తి
X

దిశ, డైనమిక్ బ్యూరో : విజయవాడ రైల్వే స్టేషన్‌లో భయంకరమైన ఘటన చోటు చేసుకుంది. శనివారం సాయంత్రం 7:45 గంటలకు విజయవాడ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫామ్ నెంబర్ 1 నుంచి ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ రైలు బయలుదేరింది. అయితే రైలు బయలుదేరుతుండగా రన్నింగ్‌లో రైలు ఎక్కించడానికి ఓ వ్యక్తి ప్రయత్నించి అదుపుతప్పి కింద పడిపోయాడు. కాలు జారి రైలు పట్టాలపై పడిపోయాడు. అయితే తెలివిగా వెల్లకిలా పడిపోయాడు. అంతా చనిపోయాడని భావించారు. కానీ ఊహించని రీతిలో అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. చిన్న గాయం కూడా కాకుండా ప్రాణాలతో బయటపడ్డాడు. దీంతో అంతా నూకలున్నాయ్ అంటూ అతడి గురించి చెప్పుకుంటున్నారు. రైలు పట్టాలపై పడిపోయిన వ్యక్తి పేరు ప్రతాప్ అని...అతడిది అనంతపురం జిల్లాగా తెలిసింది.మెుత్తానికి ఈ ప్రమాదం నుంచి ప్రతాప్ ఎలాంటి గాయం కూడా తగలకుండా బయటకు పడిపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మనోడికి నూకలున్నాయ్ అంటూ చమత్కరిస్తున్నారు.

Next Story

Most Viewed