- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జైలుకు పంపుతామంటే భయపడే వారెవరూ లేరు: పవన్ కల్యాణ్‌కు మంత్రి బొత్స కౌంటర్
దిశ, డైనమిక్ బ్యూరో : జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. రాజకీయంగా.. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన లేకుండా పవన్ కల్యాణ్ మాట్లాడుతున్నారని అన్నారు. పవన్ కల్యాణ్ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదన్నారు. పవన్ కల్యాణ్ ప్రభుత్వ పథకాలపై అవగాహన తెచ్చుకుని మాట్లాడితే బాగుంటుందని హెచ్చరించారు.బైజ్యూస్‌తో ఎటువంటి ఆర్థికపరమైన ఒప్పందం జరగలేదన్నారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యఅందించడం తప్పా అని బొత్స సత్యనారాయణ నిలదీశారు. బైజ్యూస్ ఒప్పందంలో అవినీతి జరిగితే తామే విచారణకు సిద్ధమని చెప్పుకొచ్చారు. జైలుకు పంపిస్తామని పవన్ కల్యాణ్ బెదిరిస్తే భయపడేది లేదన్నారు. పవన్ కల్యాణ్ పిల్లలు వాళ్ల బంధువుల పిల్లలు మాత్రం ఇంగ్లీషు మీడియం చదవాలి...కానీ సామాన్యుల పిల్లలు మాత్రం ఇంగ్లీషు మీడియం చదవకూడదా అని మంత్రి బొత్స సత్యనారాయణ నిలదీశారు. ఇటీవలే ఇంగ్లీషు మీడియంపై పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు చేశారు. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అంత ఫ్లూయింట్ ఇంగ్లీషు మాట్లాడరే అంటూ సెటైర్లు వేశారు. ఇంగ్లీషు అంతగా రాని బొత్స సత్యనారాయణ విద్యాశాఖకు మంత్రి కాలేదా అని చెప్పుకొచ్చారు. అదే సందర్భంలో బై జ్యూస్ ఒప్పందంలో భారీగా అవినీతి జరిగిందంటూ పవన్ కల్యాణ్ ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం దిగిపోయిన వెంటనే విద్యాశాఖలో అవినీతికి పాల్పడే వారిని జైలుకు పంపిస్తామని పవన్ కల్యాణ్ హెచ్చరించిన సంగతి తెలిసిందే.