మా నెయ్యిలో ఎలాంటి కల్తీ లేదు : ఏఆర్ డెయిరీ

by Y. Venkata Narasimha Reddy |
మా నెయ్యిలో ఎలాంటి కల్తీ లేదు : ఏఆర్ డెయిరీ
X

దిశ, వెబ్ డెస్క్ : తిరుమల శ్రీవారి మహాప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి సరఫరా ఆరోపణలు ఎదుర్కొంటున్న తమిళనాడుకు చెందిన ఏఆర్‌ డెయిరీ స్పందించింది. నాణ్యత పరీక్షల తర్వాతే నెయ్యి సరఫరా చేసినట్లు ఏఆర్‌ డెయిరీ వెల్లడించింది. సరఫరా చేసిన నెయ్యిలో ఎలాంటి నాణ్యతా లోపం లేదని వ్యాఖ్యానించింది. ఇందుకు సంబంధించిన నివేదిలను విడుదల చేసింది.తమ డెయిరీ నుంచి జూన్, జూలై నెలల్లో నెయ్యి సరఫరా చేశామని.. ఇప్పుడు టీటీడీకి నెయ్యి సరఫరా చేయడం లేదని ఏఆర్ డెయిరీ యాజమాన్యం తెలిపింది. పవిత్రమైన లడ్డూ తయారీలో స్వచ్ఛమైన ఆవు నెయ్యికి బదులు జంతువుల కొవ్వుతో చేసిన నెయ్యిని వాడారనే ప్రచారాన్ని ఏఆర్ డెయిరీ ఖండించింది. 25 ఏండ్లుగా తాము డెయిరీ సేవలను అందిస్తున్నామని..దేశవ్యాప్తంగా తమ ఉత్పత్తులను విక్రయిస్తున్నామని, ఎప్పుడూ ఇలాంటి ఆరోపణలు రాలేదని చెప్పింది. తాజాగా తమ సంస్థపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో టీటీడీకి అందించే నెయ్యి నాణ్యత ప్రమాణాలపై టెస్టులు నిర్వహించామని పేర్కొంది. ఆ టెస్టుల్లో నెయ్యిలో ఎలాంటి లోపాలు లేవని తేలిందని చెప్పింది. కానీ తమపై విషప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. టీటీడీ అడిగిన వెంటనే సంబంధిత రిపోర్టును పంపించామని తెలిపింది. కానీ టీటీడీ నుంచి తమకు స్పందన రాలేదని తెలిపింది.

మరో వైపు టీటీడీ ఈవో శ్యామలరావు మాత్రం తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిన మాట వాస్తవమేనని వెల్లడించారు. లడ్డూ తయారీకి వాడే నెయ్యిలో తాను కూడా నాణ్యతా లోపాన్ని గమనించానని తెలిపారు. అందుకే ఏఆర్ డెయిరీ కంపెనీ సరఫరా చేసిన నాలుగు ట్యాంకర్ల నెయ్యి క్వాలిటీ లేదని గుర్తించి ఫస్ట్‌టైమ్‌ టీటీడీ బయట గుజరాత్‌లోని ఎన్డీడీబీ కాఫ్‌ ల్యాబ్‌కు జూలై 6న శాంపిల్స్‌ పంపించామన్నారు. 320 రూపాయలకు కల్తీ నెయ్యి మాత్రమే వస్తుందని అర్ధమయిందని, శాంపిల్స్‌ పరీక్షల్లో 90శాతానికి పైగా క్వాలిటీ ఉండాల్సిన నెయ్యి 20శాతం కూడా క్వాలిటీ లేదని తేలిందన్నారు. సోయా, సన్‌ఫ్లవర్‌ సహా అనేక ఆయిల్స్‌ మిక్స్‌ అయ్యాయని, పిగ్‌ స్కిన్‌ ఫ్యాట్‌, అనిమల్‌ ఫ్యాట్స్‌ కూడా నెయ్యిలో ఉన్నట్టు తేలిందన్నారు. దీంతో సరఫరాదారుడిని వెంటనే బ్లాక్‌లిస్ట్‌లో పెట్టామని, న్యాయపరమైన చర్యలు కూడా తీసుకుంటున్నామని శ్యామల రావు స్పష్టం చేశారు

Advertisement

Next Story

Most Viewed