సీఎస్, డీజీపీ పై NHRC సీరియస్.. నోటీసులు జారీ!

by Jakkula Mamatha |
సీఎస్, డీజీపీ పై NHRC సీరియస్.. నోటీసులు జారీ!
X

దిశ,వెబ్‌డెస్క్: తిరుపతి(Tirupati) డిప్యూటీ మేయర్ ఉప ఎన్నిక(Deputy Mayor by-election) సందర్భంగా జరిగిన అవాంఛనీయ ఘటనలపై NHRC ఆగ్రహం వ్యక్తం చేసింది. మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో పాల్గొనేందుకు బస్సులో వెళుతున్న తిరుపతి(Tirupati) ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి(Gurumurti), ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, నగర ప్రథమ మహిళ డాక్టర్ శిరీష, అలాగే పలువురు వైసీపీ(YSRCP) కార్పొరేటర్లపై రౌడీ మూకలు దాడి చేయడం పై జాతీయ మానవ హక్కుల కమిషన్ సీరియస్(NHRC) అయ్యింది.

దాడికి సంబంధించిన ఆధారాలు వీడియోల(Videos) రూపంలో ఉంటే, గుర్తు తెలియని వ్యక్తులు పాల్పడినట్లు కేసు నమోదు చేయడాన్ని ఎన్‌హెచ్‌ఆర్‌సీ తీవ్రంగా తప్పుపట్టింది. ఈ క్రమంలో ప్రజా ప్రతినిధులపై దాడులు జరుగుతుంటే పోలీసులేం చేస్తున్నారని NHRC ప్రశ్నించింది. వారికి ఎందుకు భద్రత కల్పించలేదని నిలదీసింది. వైసీపీ ఎంపీ(YCP MP) గురుమూర్తి పలువురిపై ఫిర్యాదు చేస్తే వారి పేర్లు FIRలో ఎందుకు లేవో చెప్పాలని సూచించింది. ఈ అంశంపై వేర్వేరుగా దర్యాప్తు నిర్వహించి, నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వాలని సీఎస్(CS), డీజీపీ(DGP)కి నోటీసులు జారీ చేసింది.

Next Story