గాజువాక నుంచి తప్పుకుంటా.. మంత్రి అమర్‌నాథ్ సంచలన నిర్ణయం

by srinivas |   ( Updated:2024-05-04 10:37:49.0  )
గాజువాక నుంచి తప్పుకుంటా.. మంత్రి అమర్‌నాథ్ సంచలన నిర్ణయం
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం కొనసాగుతూనే ఉంది. ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయొద్దని కార్మికులు, విశాఖ వాసులు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. అటు ప్రభుత్వం, ప్రతిపక్షాలు సైతం విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించొద్దని డిమాండ్ చేస్తున్నాయి. తాజాగా మంత్రి అమర్‌నాథ్ విశాఖ ప్లాంట్ ప్రైవేటీకరణపై సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేకరించమని ప్రధాని మోడీ ప్రకటిస్తే తాను గాజువాక నుంచి తప్పుకుంటానని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కంటే తనకు ఏదీ ముఖ్యంకాదని మంత్రి అమర్‌నాథ్ వ్యాఖ్యానించారు.

Advertisement

Next Story