- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లొంగుబాటు..?

దిశ, వెబ్ డెస్క్: మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లొంగిపాతారనే ప్రచారం జరుగుతోంది. ఈవీఎంలు ధ్వంసం చేసిన కేసులో ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి. అయితే ఆయన ఇప్పటివరకూ పోలీసులకు చిక్కలేదు. తెలంగాణ, ఏపీలో తిరుగుతున్నట్లు పుకార్లు షికార్లు తిరుగుతున్నాయి. బుధవారం తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి వద్ద పిన్నెల్లి కారు డ్రైవర్‌తో పాటు ఆయన గన్‌మెన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాత్రం దొరకలేదు. దీంతో ఆయన కోసం పోలీసులు బృందాలుగా విడిపోయి గాలిస్తున్నారు.
ఈ నేపథ్యంలో నరసరావుపేట కోర్టులో పిన్నెల్లి లొంగిపాతారనే ప్రచారం జరుగుతోంది. దీంతో కోర్టు వద్ద పోలీసులు భారీగా పహారా కాస్తున్నారు. పిన్నెల్లి లొంగుబాటుపై తమకు మాత్రం అధికారిక సమాచారం లేదని పోలీసులు చెబుతున్నారు. కానీ పిన్నెల్లి లొంగుపోతారనే ప్రచారంతో నరసరావుపేట కోర్టు వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. అటు వైసీపీ నాయకులు కోర్టు వద్దకు భారీగా చేరుకుంటున్నట్లు తెలుస్తోంది.