విజయవాడలో నలుగురు పిల్లలు మిస్సింగ్.. సికింద్రాబాద్‌లో ప్రత్యక్షం

by srinivas |   ( Updated:2024-07-05 16:46:34.0  )
విజయవాడలో నలుగురు పిల్లలు మిస్సింగ్..  సికింద్రాబాద్‌లో ప్రత్యక్షం
X

దిశ, వెబ్ డెస్క్: విజయవాడలో శుక్రవారం మధ్యాహ్నం నలుగురు పిల్లలు అదృశ్యమయ్యారు. భవానీపురానికి చెందిన పిల్లలు ఇంటి నుంచి బయటకు వెళ్లి ఎంతకీ తిరిగివెళ్లలేదు. దీంతో కుటుంబ సభ్యులు చుట్టూ గాలించారు. ఎక్కడా కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి చేశారు. ఇద్దరు డీసీపీల ఆధ్వర్యంలో 15 టీములుగా విడిపోయి చిన్నారుల కోసం గాలించారు. సీసీ టీవీ ఫుటేజ్‌ల ఆధారంగా చివరకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో పిల్లలను గుర్తించారు. ప్రస్తుతం పిల్లలను విజయవాడ తీసుకెళ్తున్నారు. శనివారం ఉదయం తల్లిదండ్రులకు అప్పగించనున్నారు. ఆరు గంటల్లోనే కేసు ఛేదించడంతో విజయవాడ పోలీసులపై ప్రశంసలు కురుస్తున్నాయి.

Advertisement

Next Story