- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అచ్యుతాపురం ప్రమాదం: బొత్సకు సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ కౌంటర్
దిశ, వెబ్ డెస్క్: తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 60 రోజులేనని, అప్పుడే విమర్శలు చేయడం ఏంటని ఎమ్మెల్సీ బొత్స వ్యాఖ్యలకు సీఎం చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. అచ్యుతాపురం బాధితులను విశాఖ కేజీహెచ్‌లో పరామర్శించిన బొత్స.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ విమర్శలపై స్పందించిన చంద్రబాబు.. గత ప్రభుత్వం వ్యవస్థలన్నింటినీ నాశనం చేసిందన్నారు. ఒక్కొక్క వ్యవస్థలను గాడిలో పెడుతున్న సమయంలో ఈ ప్రమాదం జరగడం బాధాకరమన్నారు. గత ప్రభుత్వం సర్వ నాశనం చేసిన వ్యవస్థలను బాగు చేసే పనిలో ఉన్నామన్నారు. ఎసెన్షియా కంపెనీ మేనేజ్‌మెంట్ అవకతవకలపై దర్యాప్తు చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు.
ఇక విశాఖ మెడికోవర్, జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులనూ, వారి కుటుంబాలను సీఎం చంద్రబాబు పరామర్శించారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలి 17 మంది మృతి చెందారు. 41 మందికి పైగా గాయపడ్డారు. వీరికి వివిధ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. మృతులు, బాధిత కుటుంబాలకు రూ. కోటి చొప్పున పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులు పూర్తిగా రికవరీ అయ్యే వరకూ మెరుగైన వైద్యం అందిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.