వయసుకు తగ్గట్టుగా ఉంటే మంచిది: జేసీకి బీజేపీ మంత్రి వార్నింగ్

by srinivas |   ( Updated:2025-01-03 08:57:43.0  )
వయసుకు తగ్గట్టుగా ఉంటే మంచిది: జేసీకి బీజేపీ మంత్రి వార్నింగ్
X

దిశ, వెబ్ డెస్క్: అనంతపురం(Ananthapur)లో తమ బస్సుల దగ్ధం ఘటనకు సంబంధించి బీజేపీ(Bjp) నేతలపై జేసీ ప్రభాకర్ రెడ్డి(Jc Prabhakar Reddy) తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలపై మంత్రి సత్యకుమార్ (Minister Satya Kumar) స్పందించారు. జేసీ ప్రభాకర్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. జేసీ ప్రభాకర్ రెడ్డి వయసుకు తగ్గట్టుగా ఉంటే మంచిదన్నారు. కూటమిలో భాగస్వాములు‌గా ఉన్న బీజేపీ నేతలపై అర్ధంలేని ఆరోపణలు చేయడం సరికాదన్నారు. జేసీ వ్యాపారాలపై గతంలోనే చాలా ఆరోపణలున్నాయని సత్యప్రసాద్ వ్యాఖ్యానించారు.

కాగా జేసీ పార్క్‌లో నిర్వహించిన న్యూ ఇయర్ వేడుకలకు మహిళలు వెళ్లొద్దని, అక్కడ గంజాయి బ్యాచ్ దాడులు చేస్తే బాధ్యత ఎవరిదంటూ సినీ నటి, బీజేపీ మహిళా నాయకురాలు మాధవి లత చేసిన వ్యాఖ్యలపైనా జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచితంగా వ్యాఖ్యానించారు. మాధవి లతలాంటి వాళ్లను బీజేపీలో ఎలా చేర్చుకున్నారంటూ మండిపడ్డారు. తమ బస్సు దగ్ధంపై బీజేపీ నేతలపైనే తమకు అనుమానం ఉందని, గత ఐదేళ్లలో జగన్ తన బస్సులను అడ్డుకున్నారని, ఇలా తగలబెట్టలేదని, బీజేపీ ప్రభుత్వంలోనే ఇటువంటివి జరుగుతున్నాయని ఘాటు వ్యాఖ్యలు వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు.

Advertisement

Next Story