Pocso Case: చెవిరెడ్డిపై పోక్సో కేసులో మరో ట్విస్ట్‌

by Rani Yarlagadda |
Pocso Case: చెవిరెడ్డిపై పోక్సో కేసులో మరో ట్విస్ట్‌
X

దిశ, వెబ్ డెస్క్: వైఎస్సార్సీపీ నేత, చంద్రగిరి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి (Chevireddy Bhaskar Reddy)పై నమోదైన పోక్సో కేసు (Pocso Case)లో మరో ట్విస్ట్ తెరపైకి వచ్చింది. చెవిరెడ్డిపై అసలు తాను పోలీసులకు ఫిర్యాదు చేయలేదని బాధిత బాలిక తండ్రి మీడియాకు తెలిపాడు. తిరుపతి జిల్లాలో ఇటీవల ఓ బాలిక అత్యాచారానికి గురైంది. ఆ బాలికను పరామర్శించేందుకు వెళ్లిన చెవిరెడ్డిపై పోక్సో కేసు నమోదైంది. తాజాగా నారాయణస్వామి, భూమన కరుణాకర్ రెడ్డి సమక్షంలో బాలిక తల్లిదండ్రులు మీడియా సమావేశం నిర్వహించి.. తాము ఎవరిపైనా పోలీసులకు ఫిర్యాదు చేయలేదని స్పష్టం చేశారు. పరామర్శించడానికి వచ్చిన వ్యక్తిపై తామెందుకు కేసు పెడతామన్నారు బాలిక తండ్రి రమణ. అత్యాచార ఘటనపై అసత్య ప్రచారం జరుగుతుందని పోలీసులే సంతకం పెట్టించుకున్నారని తెలిపాడు. దీంతో అసలు బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తులెవరు అనేది ప్రశ్నార్థకంగా మారింది.

ఎర్రావారిపాలెం మండలానికి చెందిన 14 ఏళ్ల బాలిక స్కూల్ నుంచి వస్తుండగా.. ఇద్దరు దుండగులు అడ్డగించి, మత్తు బిళ్లలు కలిపిన నీళ్లు తాగించి దారుణానికి తెగబడ్డారు. కూతురు ఇంకా ఇంటికి రాకపోవడంతో వెతుక్కుంటూ వెళ్లిన తండ్రికి ముళ్లపొదల్లో కనిపించింది. శరీరంపై గాయాలు, స్పృహలో లేకపోవడంతో ఆస్పత్రికి తరలించారు. అత్యాచారానికి గురైందని తెలిసి.. తల్లిదండ్రుల గుండెలు బద్దలయ్యాయి. పరువుపోయినా పర్లేదు కానీ.. నిందితుల్ని మాత్రం ఉరితీయాలని బాధిత బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనూహ్యంగా ఈ కేసులో చెవిరెడ్డి పేరు వినిపించడంతో రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. పరామర్శకు వెళ్తే కేసులు పెడతారా అని వైసీపీ నేతలు ఫైరవుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed