- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
Prakasam barrage Boats : బోట్ల తొలగింపు కోసం అబ్బులు టీం కొత్త ప్లాన్
దిశ, వెబ్‌డెస్క్: దిశ, వెబ్‌డెస్క్: ప్రకాశం బ్యరేజీ (Prakasam Barrage)లో బోట్ల తొలగింపు ప్రభుత్వానికి పెద్ద సవాల్‌గా మారింది. ఇప్పటివరకు చేసిన మూడు ప్రయత్నాలు విఫలం కావడంతో అబ్బులు టీం సరికొత్త ప్లాన్‌కు సిద్ధమైంది. వాటర్ లోడింగ్ (Water Loading) విధానంలో బోట్లను తొలగించాలని భావిస్తోంది. ఈ విధానంలో బోట్లలో ఉన్న నీటిని తోడి బయటకు తీయడం ద్వారా బోట్ల వెయిట్ దగ్గించి వాటిని అక్కడి నుంచి తొలగించేందు ప్రయత్నిస్తారు. ఈ ప్లాన్ కచ్చితంగా వర్కౌట్ అవుతుందని, ఈ విధానం ద్వారా బోట్లను సులభంగా బయటకు తీసుకురావచ్చని అబ్బులు టీం చెబుతోంది. ఇక ఈ ప్లాన్‌లో భాగంగానే ఇప్పటికే రెండు కార్గో బోట్ల (Boats)కు ఇనుప గడ్డర్ల ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
కాగా.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో ఈ మధ్య భారీ వర్షాలు కురవడంతో విజయవాడ (Vijayawada)కు వరద పోటెత్తిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎగువ నుంచి ఒక్కొక్కటీ 40 టన్నుల బరువుండే మూడు భారీ బోట్లు వేగంగా వేగంగా కొట్టుకొచ్చి ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టాయి. దీంతో బ్యారేజీ పిల్లర్లు కూడా కొంత మేర డ్యామేజ్ (Dammage) అయ్యాయి. ఈ క్రమంలోనే ఈ బోట్లను తొలగించేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నిస్తోంది. కానీ నదీ ప్రవాహ వేగం ఎక్కువగా ఉండడంతో పాటు బోట్లు భారీ బరువు ఉండడంతో వాటిని తొలగించడం ప్రభుత్వానికి పెద్ద సవాల్‌గా మారింది.