- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొత్త డిమాండ్: రాయలసీమలో రాజధాని పెట్టాలంటున్న కాంగ్రెస్ నేత శైలజానాథ్
దిశ, డైనమిక్ బ్యూరో : ఏపీసీసీ మాజీ ప్రెసిడెంట్ శైలజానాథ్ కొత్త డిమాండ్‌ను తెరపైకి తీసుకువచ్చారు. రాయలసీమకు రాజధాని కావాలని కొత్త నినాదం వినిపించారు. మా రాజధాని మాకు కావాలి అంటూ కీలక వ్్యాఖ్యలు చేశారు. కరువుకు కేరాఫ్ అడ్రస్ అయిన రాయలసీమ గురించి మాట్లాడే నాదుడే కరువయ్యాడు అని శైలజానాథ్ అన్నారు. అనంతపురంలో సోమవారం శైలజానాథ్ మీడియాతో మాట్లాడారు.‘మా రాజధాని మాకు కావాలి... రాయలసీమలో రాజధాని పెట్టాలి’ అని శైలజానాథ్ డిమాండ్ చేశారు. మరోవైపు వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల గురించి, ప్రజల సమస్యల గురించి ఆలోచించడం మానేసిందంటూ తీవ్రంగా మండిపడ్డారు. గత 17 రోజులుగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును వేధించడం తప్ప ఇంకేమీ లేవన్నారు. ఇకనైనా వైసీపీ ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలు పక్కన పెట్టి రైతులు, ప్రజల గురించి ఆలోచించాలని శైలజానాథ్ హితవు పలికారు. ఇకపోతే రాష్ట్రంలో శాంతిభద్రతలు దారుణంగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. శాంతి భద్రతల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని వ్యాఖ్యానించారు. ప్రజలను రక్షించాల్సిన పోలీసులు కూడా అధికార పార్టీ సేవలో మునిగి తేలుతుందని చెప్పుకొచ్చారు. తిరుమల కొండపై బస్సును దొంగలు ఎత్తుకుపోయారంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో ఇట్టే అర్థం అవుతుందని శైలజానాథ్ అభిప్రాయపడ్డారు. మరోవైపు చంద్రబాబు అరెస్ట్ బీజేపీకి తెలియకుండా జరగనిది కాదని అన్నారు. కేంద్రంలోని బీజేపీకి తెలిసే చంద్రబాబు అరెస్ట్ జరిగిందని శైలజానాథ్ అభిప్రాయపడ్డారు.