- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు.. టీడీపీని వీడే ప్రసక్తే లేదు: వీపీఆర్ దంపతులు
దిశ, వెబ్ డెస్క్: తప్పుడు ప్రచారాలు నమ్మొద్దని, తాము టీడీపీని వీడే ప్రసక్తే లేదని నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి వీపీఆర్ దంపతులు తెలిపారు. నెల్లూరులోని విపిఆర్ హౌస్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నెల్లూరు పార్లమెంట్ టీడీసీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ ఇటీవల సోషల్ మీడియాలో తాము తెలుగుదేశం పార్టీని వీడుతున్నట్లు, తిరిగి వైసీపీలో చేరుతున్నట్లు అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు. అది అంతా అబద్ధమని, తాము తెలుగుదేశం పార్టీ తరపునే పోటీ చేస్తున్నామని వీపీఆర్ దంపతులు స్పష్టం చేశారు.
తమకు వస్తున్న అశేష అభిమానాన్ని తట్టుకోలేక.. అవతల పార్టీ నుంచి భారీగా చేరికలను జీర్జించుకోలేక ఈ అసత్య ప్రచారాలు చేస్తున్నారని వీపీఆర్ దంపతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో తమ విజయాన్ని అంగీకరించలేక, వాళ్ల ఓటమిని ఒప్పుకోలేక ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఇలా చేస్తున్నారన్నారు. తాము అవతల పార్టీలోకి తిరిగి వెళుతున్నామని అబద్దపు ప్రచారాలు సృష్టిస్తున్నారన్నారు. ఇది పూర్తిగా అవాస్తవమని, కొందరు పనిగట్టుకుని మరీ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. తమకు టీడీపీలో ఎలాంటి ఇబ్బందులు లేవని తెలిపారు. అందరితోనూ మంచి సఖ్యత ఉందని, పార్టీలో తమకు గౌరవం ఉందని తెలిపారు. తమ విజయం మీద ఎలాంటి అనుమానం లేదని, ప్రజల నుంచి వస్తున్న స్పందనే అందుకు నిదర్శనమన్నారు. టీడీసీ అభిమానులకు, తమ కోసం పని చేస్తున్న ప్రతి ఒక్కరికి ఒకటే మాట చెబుతున్నామని, ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేద్దామని వీపీఆర్ దంపతులు పిలుపునిచ్చారు.
తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు, మేము టిడిపిని వీడే ప్రసక్తే లేదు - వీ పి ఆర్ దంపతులు
— Vemireddy Prabhakar Reddy (@VPR_Official_) April 7, 2024
- ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా తాను కచ్చితంగా గెలుపొందుతాం - ప్రశాంతి రెడ్డి
- కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు - వీ పి ఆర్
- టిడిపిలో మాకు గౌరవం ఉంది.
తమ పార్టీ… pic.twitter.com/iMj7GwWKlD