- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నన్ను మన్నించి కోటంరెడ్డి అక్కున చేర్చుకోవాలి: స్రవంతి
దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు మేయర్ స్రవంతి సంచలన నిర్ణయం తీసుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. గతంలోనే ఆమె ఆ పార్టీకి రాజీనామా చేశారు. కానీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒత్తిడి చేయడంతో తిరిగి అదే పార్టీలో కొనసాగారు. అయితే ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి అంతకుముందు స్రవంతి ప్రధాన అనుచరురాలుగా ఉన్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున 2014 ఎన్నికల్లో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా కోటంరెడ్డి గెలిచారు. అంతేకాదు ఆయనకంటూ పార్టీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అటు జిల్లా వ్యాప్తంగా కూడా ఆయనకు అనుచరులు ఉన్నారు. అయితే ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని స్రవంతిని ఎమ్మెల్యే కోటంరెడ్డి ప్రోత్సాహించారు. దాంతో ఆమె మేయర్ అయ్యారు. పార్టీలో జరిగిన పరిణామాలతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి శ్రీధర్ రెడ్డి కోటంరెడ్డి గుడ్ బై చెప్పి తెలుగుదేశం పార్టీలో చేరారు. అయితే ఆమె కూడా పార్టీకి రాజీనామా చేశారు. కానీ వైసీపీ నాయకుల ఒత్తిడితో ఆమె వెనక్కి తగ్గారు. మేయర్‌గా కొనసాగారు.
తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఘోరంగా ఓడిపోయింది. దీంతో ఆమె వైఎస్సార్‌సీపీని వీడాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు సోమవారం రాజీనామా చేశారు. తాను రాజకీయాల్లో ఈ స్థితిలో తాను ఉండటానికి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డే కారణమని, ఆయన ప్రోత్సాహంతోనే కార్పొరేటర్‌ను అయ్యాయని స్పష్టం చేశారు. కోటంరెడ్డి వైసీపీని వీడినప్పుడు కొన్ని కారణాల వల్ల ఆయన వెంట నడవలేకపోయానని చెప్పారు. అయినా సరే కోటంరెడ్డి తన పట్ల ఎలాంటి వ్యతిరేకత చూపలేదని తెలిపారు. పెద్దమనసుతో మన్నించి తనను అక్కున చేర్చుకోవాలని స్రవంతి కోరారు.