- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
NDA MLA's: రేపు ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేల సమావేశం.. మంత్రి పదవుల పంపకంపైనే కీలక చర్చ?
దిశ, వెబ్‌డెస్క్: కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ కొలువుదీరడంతో ఇక రాష్ట్రంలోని కూటమి పార్టీల అధినేతలు ప్రభుత్వ ఏర్పాటుపై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం విజయవాడలోని ఓ కన్వెన్షన్ హాళ్లో ఉదయం 9.30 ఎన్డీయే కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించనున్నారు. మందుగా శాసనసభాపక్ష నేతగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని ఎన్నుకోనున్నారు. అదేవిధంగా జూన్ 12న బుధవారం గన్నవరం వేదికగా ఉదయం 11.27 నిమిషాలకు చంద్రబాబు సీఎంగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అదేవిధంగా ఎమ్మెల్యేల భేటీలో మంత్రివర్గ ఏర్పాటుపై స్పష్టత రానున్నట్లుగా సమాచారం. ఈ క్రమంలోనే జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి. తాను డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నానంటూ ఓ జాతీయ మీడియాకు చెప్పినట్లుగా న్యూస్ వ్యాపించడం మూడు పార్టీల్లోనూ చర్చనీయాంశం అవుతోంది.