ముగిసిన ఎన్డీఏ శాసనసభా పక్ష సమావేశం.. ఎమ్మెల్యేలకు సీఎం స్వీట్ వార్నింగ్

by Mahesh |
ముగిసిన ఎన్డీఏ శాసనసభా పక్ష సమావేశం.. ఎమ్మెల్యేలకు సీఎం స్వీట్ వార్నింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం వంద రోజుల పాలనపై ఎన్డీఏ శాసనసభా పక్ష సమావేశం నిర్వహించారు. సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) అధ్యక్షతన మంగళగిరిలో సీకే కన్వెన్షన్‌లో ఈ సమావేశం జరగ్గా.. డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌(Deputy CM Pawan Kalyan), ఏపీ బీజేపీ చీఫ్, ఎంపీ పురంధేశ్వరి(Purandeshwari) ఇతర ఎమ్మెల్యేలు, మంత్రులు పాల్గోనగా.. సుదీర్ఘ చర్చల అనంతరం రాత్రి 8.30 గంటలకు ముగిసింది. కాగా ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్యేలు ఇసుక సహా.. ఎలాంటి అక్రమాల జోలికి వెళ్లొద్దని సున్నితంగా హెచ్చరించించినట్లు తెలుస్తుంది. అలాగే రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం 100 రోజుల పాలనపై ఈ నెల 20వ తేదీ నుంచి ఆరు రోజుల పాటు ప్రజల్లో పర్యటించాలని ఎమ్మెల్యేలకు సీఎం(CM) సూచించారు. మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లను దీపావళి నుంచి ఇస్తామని శాసనసభా పక్ష(Legislature Party) భేటీలో సీఎం చంద్రబాబు ప్రకటించారు.

Advertisement

Next Story

Most Viewed