తిరుపతిలో భారీగా క్రాస్ ఓటింగ్.. ఓటమిపై కూటమి అభ్యర్థి తీవ్ర ఆవేదన

by srinivas |   ( Updated:2024-06-07 10:22:41.0  )
తిరుపతిలో భారీగా క్రాస్ ఓటింగ్.. ఓటమిపై కూటమి అభ్యర్థి తీవ్ర ఆవేదన
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 25 పార్లమెంట్ స్థానాలకు గాను 21 చోట్ల గెలుపొందారు. అయితే తిరుపతి లోక్ సభ స్థానంలో మాత్రం కూటమి జెండా ఎగురవేయలేకపోయారు. ఇందుకు కారణం క్రాస్ ఓటింగేనని కూటమి తరపున పోటీ చేసిన అభ్యర్థి వర ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి లోక్ సభలో కూటమి అభ్యర్థులు గెలిచినా ఆయన ఓటమి పాలవడంపై తీవ్ర మనోవేదనకు గురయ్యారు.

తిరుపతి పార్లమెంట్ పరిధిలో ఏడు నియోజకవర్గాలను కూటమి కైవసం చేసుకుంది. ఏడు సీట్లలో ఆరు టీడీపీ, తిరుపతిలో జనసేన విజయం సాధించింది. కాని కూటమి తరపున ఎంపీ అభ్యర్థి వర ప్రసాద్ మాత్రం విజయం సాధించలేదు. ఏడు స్థానాల్లో వైసీపీ అభ్యర్థులకంటే కూటమి నేతలు లక్షా 91 వేల 886 ఓట్ల ఆధిక్యం సాధించారు. కూటమి తరపున అభ్యర్థులకు ఓట్లు పడ్డాయి. కానీ వర ప్రసాద్ మాత్రం పడలేదు. దీంతో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగిందని తేలిపోయింది. దీని వల్లే వైసీపీ అభ్యర్థి గురుమూర్తి 16,118 ఓట్లతో విజయం సాధించారని వరప్రసాద్ అంటున్నారు. క్రాస్ ఓటింగ్ చేయడం వల్లే తాను ఓటమి పాలయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజని వరప్రసాద్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed