- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వచ్చే ఎన్నికల్లో జరగబోయేది ఇదే: RRR
దిశ, వెబ్ డెస్క్: వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కలిసి పోటీ చేయబోతున్నాయి. ఈ విషయాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఇవాళ ఉదయం టీడీపీ అధినేత చంద్రబాబును నారా లోకేశ్, బాలకృష్ణతో కలిసి రాజమండ్రి సెంట్రల్ జైలులో పరామర్శించారు. అనంతరం మీడియా సమావేశంలో జనసేన, టీడీపీ పొత్తుపై స్పష్టత ఇచ్చారు. దీంతో ఎంతోకాలంగా వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారం నిజమైంది. ఇక టీడీపీ, జనసేన పార్టీ పొత్తును నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు రియాక్ట్ అయ్యారు. జనసేన ఎరుపు, టీడీపీ పసుపు కలిస్తే కాషాయం రంగు వస్తుందని.. ఇందుకు బీజేపీ కూడా ఒప్పుకుంటుందని తాను సైతం నమ్ముతున్నట్లు తెలిపారు. బీజేపీ పెద్దల మనసులో ఏముందనేది పవన్ కల్యాణ్‌కు చాలా స్పష్టంగా తెలుసు కాబట్టే పొత్తుపై తేల్చి చెప్పేశారన్నారు. ఈసారి జరిగే ఎన్నికల్లో ఈ పార్టీల కలయికతో 160 సీట్లు వస్తాయని ఎంపీ రఘురామకృష్ణంరాజు జోస్యం చెప్పారు.